News March 17, 2025
ప్రభుత్వ పథకాలపై అధికారులతో మేడ్చల్ కలెక్టర్ సమీక్ష

జిల్లాలోని శాఖల వారీగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో ఎస్సీలకు ఎంత శాతం లబ్ధి చేకూరుతుందనే జాబితాలను మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ గౌతం పరిశీలించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని వీసీ హాల్‌లో షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ సభ్యులు జిల్లాకు మంగళవారం రానున్న సందర్భంగా జిల్లా అధికారులతో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో ఎస్సీలకు ఎంల లబ్ధి చేకూరుతుందని శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.
Similar News
News April 23, 2025
ఉగ్రదాడి.. విశాఖ వాసి గల్లంతు?

AP: జమ్మూకశ్మీర్ పహల్‌గామ్‌లోని బైసరీన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో విశాఖ వాసి గల్లంతైనట్లు సమాచారం. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి ఇటీవల అక్కడికి టూర్ వెళ్లారు. అయితే దాడి తర్వాత ఆయనకు బంధువులు ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. దీంతో చంద్రమౌళి భార్య పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన ఆచూకీ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
News April 23, 2025
జనగామ: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ సచివాలయం నుంచి సీఎస్ శాంతి కుమారి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్‌లతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతిపై కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జనగామ జిల్లా కలెక్టరెట్ నుంచి కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పాల్గొన్నారు. అన్ని మండలాల్లో ఈ చట్టంపై రైతులకు అవగాహన కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
News April 23, 2025
ఇందన్‌పల్లి బీట్ ఆఫీసర్‌పై దాడి.. ఇద్దరి రిమాండ్

ఇందన్‌పల్లి అటవీ అరేంజ్ పరిధిలోని భర్తనిపేట బీట్ ఆఫీసర్ రుబీనాతలాత్‌పై దాడి చేసిన మహమ్మద్ రియాజుద్దీన్, ఇజాజుద్దీన్‌లను రిమాండ్‌కు తరలించారు. మంగళవారం వారిని కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి వారికి 14 రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎఫ్ఆర్ఓ కారం శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసినా, కలప అక్రమ రవాణా చేసినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.