News August 27, 2024
ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ బోధన: జిల్లా కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు బోధన మెరుగుపరచడానికి ప్రణాళికాబద్ద చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ అధికారులు, ఇంగ్లీష్ మాధ్యమ ఉపాధ్యాయులతో ఇంగ్లీష్ బోధనపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతి పాఠశాలలో అర గంట క్రీడలకు అన్ని తరగతుల వారికి, అరగంట ఇంగ్లీష్ బోధన ఎంపిక చేసిన తరగతుల వారికి తప్పక ప్రతిరోజు కేటాయించాలని పేర్కొన్నారు.
Similar News
News January 2, 2026
ఈనెల 3న ఖమ్మం నగరంలో జాబ్ మేళా.!

ఖమ్మంలో ఈనెల 3న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీరామ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ సంస్థ వరుణ్ మోటార్స్లో ఖాళీగా ఉన్న మొత్తం 133 ఖాళీల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 10, ఇంటర్, ఏదైనా డిగ్రీ, బీటెక్ అర్హత కలిగిన వారు అర్హులని అన్నారు. ఆసక్తిగల నిరుద్యోగులు ఖమ్మం ఇల్లందు రోడ్డులోని వరుణ్ మోటార్స్లో జరిగే జాబ్ మేళాలో పాల్గొనాలని సూచించారు.
News January 1, 2026
టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS : సీపీ

JAN 3 నుండి 20 వరకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని పరీక్ష కేంద్రాలలో నిర్వహించే టీజీ టెట్ పరీక్షల సందర్భంగా అయా పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు. అటు సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.
News January 1, 2026
అభయ వెంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ ప్రమాణస్వీకారం

ఖమ్మం నగరంలోని అభయ వెంకటేశ్వరస్వామి ఆలయ నూతన కమిటీ సభ్యులు గురువారం ఆలయ ప్రాంగణంలో ప్రమాణస్వీకారం చేశారు. ఆలయ గౌరవ అధ్యక్షుడిగా బొల్లి కొమరయ్య, గౌరవ సలహాదారుగా పల్లెబోయిన చంద్రయ్య, దండా జ్యోతి రెడ్డి, అధ్యక్షుడిగా అల్లిక అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా బెల్లి కొండల్ రావు, కోశాధికారిగా పల్లపు సత్యంతో పాటు ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వరరావు, వీరబాబు, మణికంఠ, వెంకటేశ్వర్లు ప్రమాణం చేశారు.


