News March 8, 2025
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు :జిల్లా కలెక్టర్

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. శుక్రవారం PM శ్రీ పథకంలో ఎంపికైన వాంకిడి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో పాఠశాల అదనపు తరగతుల నిర్మాణ స్థలాన్ని జిల్లా అదనపు కలెక్టర్తో కలిసి పరిశీలించారు. వాంకిడి కస్తూరిబా విద్యాలయంలో రూ.3 కోట్ల 25 లక్షల అంచనా వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు.
Similar News
News December 5, 2025
14,967 ప్రభుత్వ ఉద్యోగాలు.. BIG UPDATE

జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 14,967 ఉద్యోగాలకు దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం నిన్నటితో గడువు ముగియగా అభ్యర్థుల వినతితో ఈ నెల 11 వరకు అవకాశం కల్పించారు. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, ఇంటర్, డిప్లొమా పాసైనవారు అర్హులు. CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: <
News December 5, 2025
Ashes Day-2: స్వల్ప ఆధిక్యంలో ఆసీస్

ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ రెండో టెస్టు రసవత్తరంగా మారుతోంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 334 రన్స్కు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు 44 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. వెదరాల్డ్ 72, లబుషేన్ 65, స్మిత్ 61, గ్రీన్ 45, కేరీ 46* పరుగులు చేశారు.
News December 5, 2025
NLG: త్రివిధ దళాలకు సహకారం అవసరం: నల్గొండ కలెక్టర్

దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న త్రివిధ దళాలకు (ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్) ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఈనెల 7న నిర్వహించనున్న సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఆమె మాట్లాడారు. ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు మనమంతా సహకరించాల్సిన బాధ్యత ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.


