News March 16, 2025

ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య: కలెక్టర్ క్రాంతి

image

ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందన సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. పటాన్ చెరు మండలం ముత్తంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం శనివారం నిర్వహించారు. పాఠశాలలో విద్యాబోధన తీరని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందని చెప్పారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Similar News

News December 9, 2025

ఆదిలాబాద్: “నేను మీ అభ్యర్థినే.. నాకెందుకు చేయరు ప్రచారం..”

image

ఉమ్మడి ఆదిలాబాద్లోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలకు వినూత్న అనుభవాలు ఎదురవుతున్నాయి. సర్పంచ్ అభ్యర్థుల ప్రచారానికి వెళ్ళినప్పుడు సొంత పార్టీ నుంచి రెబల్గా పోటీలో ఉన్నవారు వారిని ఇరకాటంలో పెడుతున్నారు. “మేము కూడా మీ పార్టీనే. ఇన్నేళ్లు పార్టీ కోసం కష్టపడ్డాం. ఇప్పుడు మీరు మాకు ఎందుకు మద్దతు ఇవ్వరు. మాకు కూడా ప్రచారం చేయండి” అని అడగడంతో నాయకులు తలలు పట్టుకుంటున్నారు.

News December 9, 2025

2,569 పోస్టులు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ

image

RRBలో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇప్పటివరకు అప్లై చేసుకోనివారు చేసుకోవచ్చు. DEC 12వరకు ఫీజు చెల్లించవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, B.Sc ఉత్తీర్ణులై, 18- 33 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.35,400 చెల్లిస్తారు. www.rrbcdg.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News December 9, 2025

పార్వతీపురం: మంత్రి చుట్టూ రోజుకో వివాదం.. పూటకో రగడ

image

మంత్రి సంధ్యారాణి చుట్టూ రోజుకో వివాదం నడుస్తోంది. ఇటీవల పచ్చకామెర్లతో గురుకుల పాఠశాల విద్యార్థులు మృతి చెందడంతో మంత్రిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మంత్రి PA వేధిస్తున్నాడని సాలూరుకు చెందిన మహిళ పోలీసులుకి ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. తాజాగా తన తల్లి <<18505977>>మరణానికి<<>> మంత్రి అనుచరుడి వేధింపులే కారణమని ఓ మహిళ కలెక్టర్‌కి ఫిర్యాదు చేసింది. మంత్రి అనుచరుల వల్ల ఆమెకు చెడ్డపేరు వస్తోందని లోకల్ టాక్.