News June 13, 2024
ప్రభుత్వ బడుల్లో సమస్యల పరిష్కారం మాది: మంత్రి రాజనర్సింహ

‘ప్రభుత్వ బడుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం టీచర్లుగా మీ బాధ్యత’ అని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. రాయికోడ్‌లో బుధవారం నిర్వహించిన ‘బడి బాట’లో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వ బడులపై ప్రజల ఆలోచన విధానం మార్చుకోవాలని, ఆ బడులు మనవి అనే భావన ప్రతి ఒక్కరిలో కలగాలని సూచించారు. ప్రైవేటుకు దీటుగా విద్య బోధన కొనసాగేలా చూడాలని కోరారు.
Similar News
News March 17, 2025
మెదక్: లక్ష్యాలు పూర్తి చేయడంలో వేగం పెంచాలి: అదనపు కలెక్టర్

బ్యాంక్ గ్యారంటీలు, సీఎంఆర్ లక్ష్యాలు పూర్తి చేయడంలో రైస్ మిల్లర్స్, బ్యాంకర్స్ వేగం పెంచాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. సోమవారం ఖరీఫ్ 24 -25 సంబంధించి బ్యాంక్ గ్యారంటీలు అందజేయడం, సీఎంఆర్ లక్ష్యాలపై బ్యాంకర్లు, రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాల మేరకు లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.
News March 17, 2025
మెదక్: ప్రజావాణి వినతులు స్వీకరించిన జిల్లా ఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని తెలిపారు.
News March 17, 2025
మెదక్: ఓపెన్ టెన్త్,ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల: DEO

ఓపెన్ SSC, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ తెలిపారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26 వరకు రెండు సమయాల్లో కొనసాగుతాయని వివరించారు. అలాగే ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 3 వరకు ఇంటర్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ఉంటాయన్నారు. విద్యార్థులు పరీక్షల కోసం సన్నద్ధం కావాలని సూచించారు. సందేహాలు ఉంటే సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.