News June 30, 2024

ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలి:  జిల్లా కలెక్టర్

image

ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో బ్యాంకర్లు, జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రైతులు తమ రుణాలను రెన్యూవల్ చేసుకునే అంశంపై వారికి అవగాహన కల్పించాలని చెప్పారు. అదే విధంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ బ్యాంకర్లు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News December 1, 2024

పాడి పశువుల పెంపకానికి చేయూత: భద్రాద్రి కలెక్టర్

image

పాడి పశువుల పెంపకానికి మరింత చేయూతను అందిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఆదివారం బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయాల జాతీయ సేవా పథకంలో భాగంగా పశు వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. పాడి పశువుల పెంపకం అనేది కొంచెం కష్టమైన పని అయినప్పటికీ దాని ద్వారా లాభాలను అర్జించవచ్చని తెలిపారు.

News December 1, 2024

రైతు పండుగ విజయవంతం పట్ల తుమ్మలకు పీసీసీ చీఫ్ అభినందనలు

image

రైతు పండుగ కార్యక్రమం విజయవంతం పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావును వారి నివాసంలో ఆదివారం పిసిసి చీప్ మహేష్ కుమార్ గౌడ్ కలిసి అభినందనలు తెలిపారు. రైతాంగంకు ఆధునిక సాగు పద్ధతులు యాంత్రీకరణ పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాలు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని చెప్పారు. బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ పై రైతు భరోసా పై యావత్ తెలంగాణ కు స్పష్టత ఇచ్చారని పేర్కొన్నారు.

News December 1, 2024

సాయితేజ మృతదేహాన్ని త్వరగా రప్పిస్తాం: ఎంపీ RRR

image

అమెరికా కాల్పుల్లో ఖమ్మం రాపర్తినగర్‌కు చెందిన <<14750277>>సాయితేజ <<>>మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ఎంపీ రఘురాంరెడ్డి ఫోన్​లో సాయితేజ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాన్ని స్వదేశానికి త్వరగా పంపించాలని వీదేశీ మంత్రిత్వ శాఖతో మాట్లాడినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువస్తామని చెప్పారు.