News September 25, 2024
ప్రభుత్వ లాంఛనాలతో మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు: ఆనం

మాజీ ఎంపీ, కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ మృతి పట్ల రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి బుధవారం సంతాపం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అంత్యక్రియల ఏర్పాట్ల కోసం నెల్లూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చర్చించారు.
Similar News
News November 24, 2025
Next నెల్లూరు మేయర్ ఎవరు..? జరుగుతున్న చర్చ ఇదే

మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం నెగ్గితే తర్వాత మేయర్ ఎవరనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. స్రవంతి ST సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో.. అదే సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలన్న అభిప్రాయం టీడీపీలో వ్యక్తమవుతోంది. అదే జరిగితే 53వ డివిజన్ కార్పొరేటర్ సుజాత, 5వ డివిజన్ కార్పొరేటర్ రవిచంద్రకు అవకాశం ఉంటుంది. లేదంటే డిప్యూటీ మేయర్‌కి ఇన్ఛార్జ్ మేయర్ బాధ్యతలు ఇచ్చే చాన్స్ కూడా ఉంది.
News November 24, 2025
నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు.. SP కీలక సూచన

రానున్న 4, 5 రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. సోమశిల నుంచి నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అజిత కోరారు. ఆదివారం 27,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాన్ని బట్టి సోమశిల నుంచి నీటిని విడుదల చేస్తారని అన్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.
News November 24, 2025
బుచ్చిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసింది రౌడీషీటర్లు..?

బుచ్చిలో గత శనివారం ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన వారు నెల్లూరుకు చెందిన రౌడీషీటర్లుగా నిర్ధారించి ఎస్పీ ఆదేశాల మేరకు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. హైవేపై కారు డోరు తెరిచి ఉంచడంతో నెల్లూరు నుంచి ఆత్మకూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ హారన్ కొట్టారు. వెంటనే కారులో ఉన్న వారు డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారు. కారులో బీరు బాటిల్ కూడా దర్శనమిచ్చాయి.


