News September 25, 2024
ప్రభుత్వ లాంఛనాలతో మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు: ఆనం
మాజీ ఎంపీ, కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ మృతి పట్ల రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి బుధవారం సంతాపం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అంత్యక్రియల ఏర్పాట్ల కోసం నెల్లూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చర్చించారు.
Similar News
News October 8, 2024
అయోమయ పరిస్థితిలో కాకాణి: బొబ్బేపల్లి
సర్వేపల్లిలో అనేక అక్రమాలకు పాల్పడి ఇప్పుడు ఓటమితో కాకాణి గోవర్ధన్ రెడ్డి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బొబ్బేపల్లి సురేశ్ నాయుడు అన్నారు. ముత్తుకూరులో ఆయన మాట్లాడారు. కాకాణి చేసిన అక్రమాల ఆనవాళ్లు సర్వేపల్లిలో ఇంకా చెక్కు చెదరలేదని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఏమీ చేయకపోగా ఇప్పుడు రోజూ ప్రెస్ మీట్లతో అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
News October 7, 2024

కోట సీడీపీఓ మునికుమారికి మెమో జారీ
కోట ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ మునికుమారికి సోమవారం మెమో జారీ చేసినట్టు తిరుపతి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. కోట ప్రాజెక్టు పరిధిలోని 9 సెక్టార్ల పరిధిలో గల 200 మంది ఆయాలచే కోటలోని ప్రాజెక్టు కార్యాలయంలో బాత్రూములు, మరుగుదొడ్లు కడిగించడం, కార్యాలయం, ఆవరణమంతా శుభ్రం చేయించడం, మొక్కలకు నీళ్లు పోయడం, ముగ్గులు వేయించడం చేశారు. దీంతో మెమో జారీ చేసినట్లు తెలిపారు.