News March 27, 2025
ప్రభుత్వ విద్యార్థులు ప్రతిభ చాటాలి: ఖమ్మం కలెక్టర్

విద్యార్థులు ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగడమే లక్ష్యంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కొనిజర్ల(M) తనికెళ్లలోని బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న జాబ్ మేళాలో అభ్యర్థుల ఇంటర్వ్యూ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ విద్యార్థులలో ఉత్తమమైన ప్రతిభ కలిగిన వారికి ప్రైవేట్ కంపెనీలో అవకాశం కల్పిస్తే మెరుగ్గా రాణిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News December 8, 2025
ఖమ్మం: ఉద్యోగులకు కోడ్ ఆఫ్ కండక్ట్.. కరచాలనం చేసినా తప్పే!

ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అభ్యర్థులతో కరచాలనం చేసినా, అనవసర సాన్నిహిత్యం ప్రదర్శించినా అది ఎన్నికల నియమావళి (ఎంసీసీ) ఉల్లంఘన అవుతుందని సంఘం హెచ్చరించింది. అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారనే భావన ప్రజల్లో కలిగితే, అది ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. నిబంధనలు అతిక్రమిస్తే, సర్వీసు నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.
News December 8, 2025
ఖమ్మం: తొలి విడత పోరుకు 1,562 బ్యాలెట్ బాక్సులు

ఖమ్మం జిల్లాలో తొలి విడత జీపీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తొలి దశలో 7 మండలాల్లోని 192 సర్పంచ్ స్థానాలు,1,740 వార్డులకు ఎన్నిక జరగనుంది. ఇప్పటికే 20 మంది సర్పంచ్‌లు,158 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 1,582 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం 1,582 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. ఈనెల 11న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరిపి, 2 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు.
News December 8, 2025
ఖమ్మం: రెబల్స్‌కు షాక్..?

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్లు వేసిన రెబల్స్‌కు పార్టీ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మూడు విడతలుగా జరిగిన నామినేషన్ ప్రక్రియలో పలువురు కాంగ్రెస్ నాయకులు రెబల్స్‌గా బరిలో దిగారు. దీంతో రెబల్స్‌గా పోటీ చేసే వారిని సస్పెండ్ చేసేందుకు జిల్లా, మండల కాంగ్రెస్ అధ్యక్షులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.


