News November 30, 2024
ప్రభుత్వ విద్యా సంస్థల బంద్‌కు పిలుపు

ప్రభుత్వ విద్యా సంస్థల్లో వరసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలను నిరసిస్తూ రేపు ఖమ్మం జిల్లాలో విద్యా సంస్థల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు అనేక మరణాలు జరిగాయని వారు ఆరోపించారు. చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ఎగ్స్ గ్రేషియా చెల్లించి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. SFI,PDSU,AISF సంఘాలు బంద్ కు మద్దతు ఇస్తున్నట్లు ఆసంఘాల ప్రతినిధులు తెలిపారు.
Similar News
News January 25, 2026
రేపటి నుంచే ‘వాహన్’ సేవలు.. శిక్షణపై డీలర్ల అసంతృప్తి!

జిల్లాలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇకపై ‘వాహన్’ పోర్టల్ ద్వారా సాగనుంది. ఖమ్మం, వైరా, సత్తుపల్లి పరిధిలోని 72 షోరూంలలో సోమవారం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. వెబ్‌సైట్ నిర్వహణపై అధికారుల నుంచి కనీస అవగాహన, శిక్షణ లేకపోవడంతో షోరూం యజమానులు పెదవి విరుస్తున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే వినియోగదారులు ఇబ్బంది పడతారని వాపోతున్నారు. అధికారులు శిక్షణ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
News January 25, 2026
ఖమ్మం: మున్సిపల్ ఎన్నికలు.. BRS ఇన్‌ఛార్జిలు వీరే..!

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు అధిష్టానం ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. ఏదులాపురం – ఎమ్మెల్సీ తాతా మధు, మధిర – మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును నియమించారు. అలాగే వైరా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, సత్తుపల్లి – కె.నాగభూషణం వ్యవహరించనున్నారు. వీరు ఆయా ప్రాంతాల్లో నేతలను సమన్వయం చేస్తూ పార్టీ గెలుపునకు కృషి చేయనున్నారు.