News January 19, 2025
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి: ఏఐవైఎఫ్
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు డిమాండ్ చేశారు. వచ్చే నెల 6, 7, 8, 9వ తేదీలలో శ్రీకాకుళంలో జరిగే ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలకు నంద్యాల జిల్లా నుంచి యువతీ, యువకులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం నంద్యాలలోని సీపీఐ కార్యాలయంలో నాయకులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు.
Similar News
News January 19, 2025
కర్నూలు: ఘనంగా వేమన జయంతి
యువత వేమన పద్యాల సారాంశాన్ని పాటించి అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అన్నారు. ఆదివారం కర్నూలు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో యోగి వేమన జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.
News January 19, 2025
తిక్కారెడ్డి సంచలన కామెంట్స్
టీడీపీ ఎమ్మెల్యేలు పదవులు అమ్ముకుంటున్నారంటూ కర్నూలు <<15188222>>జిల్లా <<>>టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయావర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు రూ.5లక్షలకు డీలర్‌షిప్‌లు, నామినేటెడ్ పోస్టులను అమ్ముకుంటున్నారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. వీరి అవినీతి వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై మీరేమంటారు.. కామెంట్ చేయండి.
News January 19, 2025
9వ రోజు 246 మంది అభ్యర్థుల ఎంపిక
ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలులోని ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌లో 9వ రోజు దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. 600 మంది అభ్యర్థులకు గాను 338 మంది అభ్యర్థులు బయోమెట్రిక్‌కు హజరయ్యారన్నారు. ఫైనల్ పరీక్షకు 246 మంది అభ్యర్థులు అర్హత సాధించారని ఎస్పీ తెలిపారు.