News February 26, 2026

ప్రభుత్వ సేవల్లో AI వినియోగం పెంచాలి: కలెక్టర్

image

ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని పెంచాలని కలెక్టర్ షాన్‌మోహన్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ సిబ్బందికి ఏఐ సాంకేతికతపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఫైలింగ్ వంటి పనుల్లో ఏఐని వాడటం ద్వారా పారదర్శకత, వేగం పెరుగుతాయని పేర్కొన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడం వల్ల ప్రభుత్వ సేవల నాణ్యత మెరుగుపడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

Similar News

News April 16, 2026

నెల్లూరు GGH ఉద్యోగాల మెరిట్ జాబితా విడుదల

image

నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ‘డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్’లో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి సంబంధించి తాత్కాలిక మెరిట్ జాబితాను అధికారులు విడుదల చేశారు. మార్చి 31‌-ఏప్రిల్ 9 వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వివరాలను spsnellore.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల (ఏప్రిల్) 21వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కార్యాలయంలో వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు

News April 16, 2026

మల్లె సాగు – దిగుబడి పెరగాలంటే..

image

మల్లె నాటిన 6 నెలల తర్వాత పూత ప్రారంభమై మొక్క పెరిగే కొద్ది దిగుబడి పెరుగుతుంది. మూడో ఏడాది నుంచి 12-15 సంవత్సరాల వరకు దిగుబడినిస్తుంది. తాజా పువ్వుల కోసం పూర్తిగా అభివృద్ధి చెంది తెరవని మొగ్గలను ఉదయాన్నే 11 గంటల లోపలే కోయాలి. లేకపోతే పువ్వుల నాణ్యత తగ్గిపోతుంది. దిగుబడి పెంచుటకు లీటర్ నీటికి జింక్ సల్ఫేట్ 2.5గ్రా, మెగ్నీషియం సల్ఫేట్ 5గ్రా. సూక్ష్మదాతువులను కలిపి 2,3 దఫాలుగా పిచికారీ చేయాలి.

News April 16, 2026

బాపట్ల జిల్లాలో ముమ్మర తనిఖీలు: SP

image

నేరాల నియంత్రణే లక్ష్యంగా జిల్లా పోలీసులు SP ఉమామహేశ్వర్ ఆదేశాలతో రేపల్లె, బాపట్ల, చీరాల పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. మొత్తం 210 మంది పోలీసులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 90 బైకులు, 3 ఆటోలు, ఒక కారును సీజ్ చేసినట్లు SP వెల్లడించారు. గంజాయి, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.