News February 26, 2026
ప్రభుత్వ సేవల్లో AI వినియోగం పెంచాలి: కలెక్టర్

ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని పెంచాలని కలెక్టర్ షాన్‌మోహన్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ సిబ్బందికి ఏఐ సాంకేతికతపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఫైలింగ్ వంటి పనుల్లో ఏఐని వాడటం ద్వారా పారదర్శకత, వేగం పెరుగుతాయని పేర్కొన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడం వల్ల ప్రభుత్వ సేవల నాణ్యత మెరుగుపడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News April 16, 2026
మామునూర్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిపై ఏఏఐ సమీక్ష

వరంగల్‌లో మామునూర్ ఎయిర్‌పోర్ట్‌ను గురువారం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సందర్శించారు. కలెక్టర్ సత్య శారదతో కలిసి సమావేశమై రన్‌వే, టెర్మినల్ సదుపాయాలు, భద్రత అంశాలను సమీక్షించారు. అభివృద్ధి పనులపై అవసరమైన మెరుగుదలలపై చర్చించారు. ఎయిర్‌పోర్ట్ అభివృద్ధితో రవాణా, పరిశ్రమలు, పర్యాటక రంగాలకు ఊతమిస్తుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
News April 16, 2026
ముంబై బ్యాటింగ్.. రోహిత్ శర్మ దూరం

ముంబైతో మ్యాచులో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ ఈ మ్యాచుకు దూరం అయ్యారు. డికాక్ జట్టులోకి వచ్చారు.
ముంబై: డికాక్, రికెల్టన్, సూర్య, తిలక్, నమన్ ధీర్, హార్దిక్ (C), రూథర్‌ఫోర్డ్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, మయాంక్ రావత్, బుమ్రా.
పంజాబ్: ప్రభ్‌సిమ్రాన్, ప్రియాన్ష్, శ్రేయస్(C), కనోలి, శశాంక్ సింగ్, స్టాయినిస్, యాన్సెన్, బార్ట్‌లెట్, వైశాక్, అర్ష్‌దీప్, చాహల్.
News April 16, 2026
బెంగాల్ ‘మాజీ ఓటర్ల’కు రిలీఫ్?

బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ SIRతో ఓట్లు కోల్పోయిన వారికి ఊరట లభించే అవకాశం ఉంది. ఎన్నికల జాబితాలో పేరు చేర్చేందుకు అప్పీలేట్ ట్రైబ్యునల్స్ నుంచి క్లియరెన్స్ తీసుకున్న వారు ఓటు వేయొచ్చని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఎన్నికలకు రెండు రోజుల ముందే ఈ క్లియరెన్స్ వచ్చి జాబితాలో లిస్ట్ అయ్యి ఉండాలని స్పష్టం చేసింది. కాగా SIRతో బెంగాల్‌లో దాదాపు 91లక్షల ఓట్లు పోయాయి.


