News June 12, 2024
ప్రమాణ స్వీకారోత్సవ ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు: కర్నూలు కలెక్టర్

రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు కలెక్టర్ డా.జి.సృజన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు వీక్షించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. బుధవారం ఉదయం 10.00 గంటల నుంచి ఈ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుందన్నారు.
Similar News
News March 24, 2025
కర్నూలు మేయర్ పీఠంపై టీడీపీ కన్ను!

కర్నూలు మేయర్ బీవై రామయ్యకు అవిశ్వాస గండం తప్పదా? ఈ అంశం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మరో ఏడాది పదవీ కాలం ఉండగా TDP అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. నగర కార్పొరేషన్‌లో 52మంది కార్పొరేటర్లు ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ బలం 22కు చేరింది. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 28మంది అవసరం. పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.
News March 24, 2025
కర్నూలులో టీడీపీ నేత హత్య.. నిందితుడి భార్య అరెస్ట్

కర్నూలులో పాత కక్షలతోనే టీడీపీ నేత సంజన్న ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తాజాగా నిందితుడు వడ్డె రామాంజనేయులు భార్య సావిత్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. వడ్డె రామాంజనేయులుతో పాటు అతడి ముగ్గురు కుమారులు, మరొకరిని పోలీసులు ఇది వరకే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
News March 24, 2025
డబుల్ సెంచరీతో చెలరేగిన రుత్విక్ కళ్యాణ్

కర్నూలులో జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పోటీల్లో కర్నూలుకు చెందిన రుత్విక్ కళ్యాణ్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. నంద్యాలతో జరిగిన మ్యాచ్‌లో 219 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు ఆదోనితో జరిగిన మ్యాచ్‌లో 122 బంతుల్లో 154 పరుగులు చేసి తన సత్తా చాటాడు. క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయికి రుత్విక్ కళ్యాణ్ చేరుకోవాలని పలువురు ఆకాంక్షించారు.