News February 20, 2025
ప్రమాణ స్వీకార సభలో పాల్గొనడం ఆనందగా ఉంది: విష్ణువర్ధన్ రెడ్డి

ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకార సభలో పాల్గొనడం తనకు ఆనందాన్ని, అనుభూతిని కలిగించిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ‘ఢిల్లీ ప్రజలు బీజేపీకి చారిత్రక మెజారిటీ ఇచ్చి, ఆశీర్వాదించారు. ప్రధాని సహకారంతో ప్రభుత్వం ఢిల్లీని అభివృద్ధి చేసి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తుందనే విశ్వాసం ఉంది’ అన్నారు. సీఎంకు, మంత్రులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News March 25, 2025
కొత్త సినిమాల టికెట్ ధరల పెంపునకు గ్రీన్‌సిగ్నల్

ఉగాది సందర్భంగా రిలీజయ్యే కొత్త సినిమాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నార్నె నితిన్, సంతోష్ శోభన్ కాంబోలో తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’, నితిన్ నటించిన ‘రాబిన్‌హుడ్’ సినిమాల టికెట్ ధరల పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్‌లలో రూ.50, మల్టీప్లెక్సుల్లో టికెట్ ధరలపై రూ.75 పెంచుకునేందుకు అనుమతిచ్చింది. పెరిగిన ధరలు 7 రోజుల పాటు అందుబాటులో ఉంటాయంది. TGలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
News March 25, 2025
సిరిసిల్ల జిల్లాలోని ఉష్ణోగ్రతల వివరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. సిరిసిల్ల 37.9 °c, వీర్నపల్లి 37.8°c, గంభీరావుపేట 37.8°c, కోనరావుపేట 37.6°c, రుద్రంగి 37.7°c, తంగళ్లపల్లి 35.6°c, ఇల్లంతకుంట 35.9°c,ఎల్లారెడ్డిపేట 35.0°cలుగా నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
News March 25, 2025
విశాఖ రైతు బజార్‌లో నేటి కూరగాయల ధరలు

విశాఖ రైతు బజార్‌లలో మంగళవారం నాటి కూరగాయల ధరలు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ విధంగా నిర్ణయించారు. ఉల్లిపాయలు రూ.23, బంగాళ రూ.15, టమాటలు రూ.15, బెండకాయలు రూ.30, వంకాయలు రూ.27/32/40,కాకరకాయలు రూ.38, ఆనపకాయ రూ.14, బీరకాయలు రూ.42, క్యాబేజి రూ.12, కాలి ఫ్లవర్ రూ.20, దొండకాయలు రూ.30,బీట్ రూట్ రూ.20,పొటల్స్ రూ. 46,మునగకాడలు రూ.28, క్యారట్ రూ.20,కీరా దోసకాయ రూ.22,మామిడి కాయలు రూ.40గా నిర్ణయించారు.