News October 1, 2024

ప్రమాదవశాత్తు పోచారం కెనాల్‌లో పడి యువకుడి మృతి

image

నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట గ్రామానికి చెందిన గోరుకుల లక్ష్మణ్ (23) ప్రమాదవశాత్తు పోచారం ప్రధాన కాలువలో కాలుజారి ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం లక్ష్మణ్ పోచారం ప్రధాన కాలువలో స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్లి తిరిగిరాలేదు. కాగా సోమవారం సాయంత్రం పోచారం ప్రధాన కాల్వలోశవమై కనిపించినట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News October 15, 2024

KMR: మంత్రాలు వేస్తున్నాడని కంట్లో కారం చల్లి కొట్టారు.. చివరికి కేసు

image

కామారెడ్డి జిల్లా అడ్లూర్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి మంత్రాలు వేస్తున్నాడనే నెపంతో గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తిని గ్రామస్థులు చెట్టుకు కట్టేసి, కారంపొడి చల్లి కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో సాయిలు తలకు, కాళ్ల భాగాలలో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో వెంకోల్ల రాజు, వెంకోల్ల లక్ష్మణ్, స్వామి, గడ్డమీది లక్ష్మణ్‌పై కేసు నమోదుచేసినట్లు దేవునిపల్లి SI రాజు తెలిపారు.

News October 15, 2024

NZB: త్వరలో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ: మహేష్ కుమార్

image

త్వరలోనే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు వివిధ కారణాలతో వాయిదా పడుతున్న మంత్రి వర్గ విస్తరణ త్వరలోనే జరుగుతుందని తెలిపారు. కాగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తోందని స్పష్టం చేశారు.

News October 14, 2024

చందూర్: నిజాంసాగర్ కాలువలో మృతదేహం

image

చందూర్ గ్రామ శివారులో నిజాంసాగర్ ప్రధాన కాలువలో (28 ) గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సోమవారం కాలువలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి శరీరంపై బ్లాక్ కలర్ ప్యాంటు, ఎల్లో కలర్ షర్ట్ ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహన్ని మార్చురీకి తరలించినట్లు వెల్లడించారు.