News October 22, 2024

ప్రమాద రహిత బొగ్గు గని అవార్డు అందుకున్న సింగరేణి

image

ప్రమాద రహిత బొగ్గు గనులకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతి ఏటా అందజేస్తున్న ఫైవ్ స్టార్ అత్యుత్తమ గనుల అవార్డుకు ఈసారి సింగరేణి రామగుండం-3 OCP-1 (ఎక్స్ టెన్షన్ ఫేజ్-2) గని, ఇల్లందు జవహర్ ఖని-OCP ఎంపికైంది. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సతీశ్ చంద్ర దూబే చేతుల మీదుగా సింగరేణి C&MD బలరామ్, డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి, GM జాన్ ఆనంద్, PO రాధాకృష్ణ, నీరజ్ కుమార్ ఓజా అవార్డును అందుకున్నారు.

Similar News

News November 2, 2024

KNR: ‘పెన్షన్, హెల్త్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి’

image

సింగరేణి సంస్థ మాజీ ఉద్యోగులు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ నవంబర్‌లో పెన్షన్, CPRMS (మెడికల్ కార్డు) రెన్యువల్ కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలని రామగుండం సింగరేణి యాజమాన్యం పేర్కొంది. సకాలంలో దరఖాస్తులు చేయకపోతే పెన్షన్ డబ్బులు ఆగిపోతాయని, హెల్త్ కార్డు వ్యాలిడిటీ ముగుస్తుందని పేర్కొన్నారు. సంస్థ ప్రయోజనాల కోసం వెంటనే దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News November 2, 2024

హుజురాబాద్ బ్రిడ్జిపై బోల్తాపడ్డ లారీ.. ట్రాఫిక్ జామ్

image

KNR జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామ సమీపంలోని బ్రిడ్జిపై శుక్రవారం అర్ధరాత్రి ఓ లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో వరంగల్-కరీంనగర్ రహదారిపై భారీగా వాహనాలు నిలిచి ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లియర్ చేశారు.

News November 2, 2024

పెద్దపల్లి: సమగ్ర కుటుంబ సర్వే ప్రజాభిప్రాయ సేకరణలో కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనే విజయవంతం చేయాలని బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సమగ్ర కులాల స్థితిగతులపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాల్గొన్నారు. సమగ్రంగా అన్ని కులాల వారు ఎంత మంది ఏ స్థితిగతులలో ఉన్నారో తెలుసుకుంటుందని అన్నారు.