News February 9, 2025
ప్రయాగరాజ్‌కు మరో స్పెషల్ బస్ ఏర్పాటు

ఆర్టీసీ గుంటూరు-2 డిపో నుంచి మహాకుంభమేళా (ప్రయాగరాజ్)కు మరో స్పెషల్ బస్ ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ షేక్. అబ్దుల్ సలాం శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఈనెల 11న ఏర్పాటు చేసిన బస్సు నిండిపోవడంతో 15వ తేదీన మరో పుష్ బ్యాక్ సూపర్ లగ్జరీ బస్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ యాత్ర మొత్తం 8 రోజులు ఉంటుందని చెప్పారు. ఫిబ్రవరి 15న ఉదయం 10గంటలకు గుంటూరులో బస్సు బయలుదేరుతుందన్నారు.
Similar News
News March 24, 2025
అధికారులకు గుంటూరు కలెక్టర్ సూచనలు

ఈనెల 25, 26 తేదీల్లో వెలగపూడి సచివాలయం వద్ద జరిగే కలెక్టర్ల సమావేశ ఏర్పాట్లను ఆదివారం గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు గురించి స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్దేశించిన మేరకు అధికారులు ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
News March 23, 2025
తుళ్లూరు: సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

ఈనెల 31 తేదీన అమరావతి రాజధాని ప్రాంతంలో పీ4 కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆర్డిఓ శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద జరుగుతున్న పనులు పరిశీలించి అధికారులకు ఆమె సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, డీఎస్పీ పాల్గొన్నారు.
News March 23, 2025
ఎయిర్ టాక్సీలకు కేంద్రంగా గుంటూరు

ఎయిర్ టాక్సీలకు కేంద్రంగా గుంటూరు మారుతోంది. ఈ గాల్లో ఎగిరే టాక్సీలను తయారు చేస్తున్న సంస్థ పేరు మ్యాగ్నమ్ వింగ్స్. గుంటూరు నల్ల చెరువులో చావా అభిరాం అనే వ్యక్తి ఈ ఎయిర్ ట్యాక్సీలను తయారు చేస్తున్నాడు. ట్రాఫిక్‌తో సతమతమవుతున్న నగరాల్లో ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ పనికి పూనుకున్నారు. తక్కువ ఖర్చుతో ఈ ఎయిర్ ట్యాక్సీలో ప్రయాణం చేసేలా రూపొందిస్తున్నారు.