News May 12, 2024
ప్రయాణికుల రద్దీతో గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్- విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైలును, గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. నేడు సికింద్రాబాద్‌లో 19.45 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు సత్తెనపల్లి, గుంటూరు, విశాఖపట్నం 06.30 గంటలకు చేరుతుందన్నారు. అయితే పలు రైళ్లకు అదనపు బోగీలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Similar News
News February 10, 2026
GNT: శైవక్షేత్రాలకు అదనపు ఆర్టీసీ బస్సులు

శివరాత్రి సందర్భంగా భక్తుల కోసం RTC విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తుల రద్దీ కారణంగా అదనపు బస్సులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి తెలిపారు. గుంటూరు–1, గుంటూరు–2తో పాటు మంగళగిరి, తెనాలి, పొన్నూరు డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. ఈ నెల 12 నుంచే శ్రీశైలానికి బస్సులు అందుబాటులో ఉంటాయి. కోటప్పకొండకు గుంటూరు నుంచి 90, క్వారీ 38, గోవాడకు 34 బస్సులు ఏర్పాటు చేశారు.
News February 9, 2026
మంగళగిరిలో మేఘాలయ బృందం పర్యటన

‘ఎనీమియా ముక్త్ భారత్’ పరిశీలన ఆంధ్రప్రదేశ్‌లో’ ఎనీమియా ముక్త్ భారత్’ అమలు తీరును పరిశీలించేందుకు మేఘాలయ NHM ఉన్నతాధికారుల బృందం సోమవారం మంగళగిరిలో పర్యటించింది. స్థానిక ఉన్నత పాఠశాల, పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రక్తహీనత నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకంలో AP అగ్రస్థానంలో ఉన్నందున క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చామని అధికారులు తెలిపారు. రేపు అంగన్వాడీ, PHCలను ఈ బృందం సందర్శించనుంది.
News February 9, 2026
గుంటూరులో ఆకట్టుకుంటున్న ప్రదర్శనలు

గుంటూరు వేంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా జరుగుతున్న “భారత రంగ్ మహోత్సవ్-అంతర్జాతీయ నాటకోత్సవాలు” సోమవారంతో 4వ రోజుకు చేరాయి. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. తెలుగు నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, తదితరులు పాల్గొని సీనియర్ కళాకారులను ప్రత్యేకంగా సత్కరించారు.


