News April 11, 2025
ప్రయాణికుల రద్దీ మేరకు చర్లపల్లికి ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్(CHE), తెలంగాణలోని చర్లపల్లి(CHZ) మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ 11 నుంచి జూన్ 27 వరకు ప్రతి శుక్రవారం CHZ- CHE(నెం.07025), ఏప్రిల్ 12 నుంచి జూన్ 28 వరకు ప్రతి శనివారం CHE- CHZ(నెం.07026) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, అనకాపల్లితో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Similar News
News April 18, 2025
టెక్కలిలో చారిత్రాత్మక కట్టడాలలో కొన్ని ఇవే..

టెక్కలి చరిత్ర తెలిసే విధంగా కొన్ని చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. వందల ఏళ్ల క్రితం పూర్వం టెక్కలిలో రాజుల పరిపాలనలో ఉన్న రాజుగారి కోట, కోట భవనాలు, మిస్సమ్మ బంగ్లా, పురాతన ఆలయాలు టెక్కలిలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. సంతబొమ్మాళి మండలం సీతానగరం వద్ద బ్రిటీష్ కాలం నాటి ముసళ్ల ఖానా వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగి ఉంది. ఇక్కడ మండు వేసవిలో కూడా నీరు పుష్కలంగా ఉంటుంది. WORLD HERITAGE DAY
News April 18, 2025
బారువా: ముస్తాబు అవుతున్న బీచ్ ఫెస్టివల్

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో బారువా బీచ్‌లో ఏప్రిల్ 19, 20వ తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ ఫెస్టివల్‌లో భాగంగా బీచ్‌లో ఆలివ్ రిడ్లీ తాబేలు పిల్లల్ని సముద్రంలోకి విడిచిపెడతారు. ఈ ఫెస్టివల్‌లో బీచ్ వాలీబాల్, వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, బోట్ రైడింగ్ మొదలైన క్రీడల పోటీలు నిర్వహిస్తారు.
News April 18, 2025
నరసన్నపేట: ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పద మృతి

నరసన్నపేట వంశధార సబ్ డివిజన్‌లో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న కోర్రాయి వెంకటరమణ (57) అనుమానాస్పదంగా అనుమానాస్పదంగా మృతి చెందారు. నరసన్నపేట మారుతి నగర్ ఒకటో వీధిలో నివాసముంటున్నారు. ఆయన భార్య ఇటీవల మృతి చెందింది. మూడ్రోజులుగా అతడు బయటకు రాలేదని, శుక్రవారం సాయంత్రం దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉందని ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు.