News October 31, 2024
ప్రయాణికుల రద్దీ మేరకు తిరుపతికి ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సికింద్రాబాద్(SC), తిరుపతి(TPTY) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నవంబర్ 3 నుంచి 24 వరకు ప్రతి ఆదివారం TPTY- SC(నం.07481), నవంబర్ 4 నుంచి 25 వరకు ప్రతి సోమవారం SC- TPTY(నం.07482) మధ్య ఈ ట్రైన్లు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడతో పాటు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Similar News
News October 17, 2025
ప్రసూతి మరణాల నివారణకి చర్యలు: కలెక్టర్

ప్రసూతి మరణాలు సంభవించకుండా వైద్య ఆరోగ్య శాఖాధికారులు కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. శుక్రవారం మధ్యాహ్నం తన ఛాంబర్లో వైద్యాధికారులతో సమావేశమైన కలెక్టర్ ప్రసూతి మరణాలపై సమీక్షించారు. మాతృత్వ మరణాలను నివారించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. హైరిస్క్ ప్రెగ్నెంట్ కేసుల విషయంలో వైద్యులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News October 17, 2025
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా రహదారుల భద్రత సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అజెండా అంశాలపై సమీక్షించిన కలెక్టర్, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
News October 16, 2025
కృష్ణా: బెల్ట్ షాపుల్లో మద్యం సురక్షితమేనా.?

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సురక్ష యాప్ ద్వారా వైన్ షాపులు, బార్లలో మద్యం సీసాల స్కానింగ్ సదుపాయం అందుబాటులో ఉంది. అయితే, బెల్ట్ షాపుల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని మద్యం ప్రియులు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం మద్యం విక్రయిస్తున్న ఈ బెల్ట్ షాపుల్లో అమ్ముతున్న సీసాలు అసలువో, నకిలీవో తెలుసుకునే అవకాశం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.