News December 5, 2024

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు 

image

ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా బ్రహ్మపూర్(BAM), సికింద్రాబాద్(SC) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.07027 SC-BAM ట్రైన్‌ DEC 6 నుంచి 27 వరకు ప్రతి శుక్రవారం, నం.07028 BAM-SC ట్రైన్‌ DEC 7 నుంచి 28 వరకు ప్రతి శనివారం నడుస్తాయన్నారు. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు. 

Similar News

News December 11, 2025

కృష్ణా జిల్లా కలెక్టర్‌, మంత్రికి సీఎం ఇచ్చిన ర్యాంకు ఎంతంటే..!

image

సీఎం చంద్రబాబు కలెక్టర్ల పనితీరుపై ర్యాంకులు ప్రకటించారు. గత 3 నెలలకు సంబంధించిన నివేదికలో కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ ఫస్ట్ ర్యాంకు సాధించారు. కలెక్టర్ 1,482 ఫైళ్లు స్వీకరించగా, 1,469 ఫైళ్లను వేగంగా పరిష్కరించారు. సగటు స్పందన సమయం 14 గంటలు 42 నిమిషాలు. డిజిటల్ పాలనలో కృష్ణా జిల్లా ఆదర్శంగా నిలిచింది. అదే విధంగా సీఎం మంత్రుల ర్యాంకులను ప్రకటించగా మంత్రి కొల్లు రవీంద్ర 24వ స్థానంలో నిలిచారు.

News December 11, 2025

కృష్ణా జిల్లా కలెక్టర్‌కు మెుదటి ర్యాంక్

image

జిల్లాల కలెక్టర్ల పనితీరుపై రూపొందించిన ఈ-ఫైల్ డిస్‌పోజల్ రిపోర్ట్‌ (గత 3 నెలల)లో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే తొలి ర్యాంకు సాధించింది. కలెక్టర్ బాలాజీ సారథ్యంలో సెప్టెంబర్‌ 9 నుంచి డిసెంబర్‌ 9, 2025 వరకు 1,482 ఫైళ్లు స్వీకరించగా, 1,469 ఫైళ్లను వేగంగా పరిష్కరించారు. సగటు స్పందన సమయం 14 గంటలు 42 నిమిషాలే.. డిజిటల్ పాలనలో కృష్ణా జిల్లా ఆదర్శంగా నిలిచింది.

News December 10, 2025

గన్నవరం: ఇసుక కుప్ప కాదండి.. రంగు మారిన ధాన్యం..!

image

పై ఫోటోలో మీకు కనిపిస్తున్నది ఇసుక కుప్ప అనుకుంటున్నారు కదూ. కానే కాదు.. అది రంగు మారిన ధాన్యం రాశి. గత మొంథా తుఫాను వరదలో నానిన వరి చేను నూర్చారు. గన్నవరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలో ఇలా రంగు మారిన ధాన్యం రాశులు చూడొచ్చు. రైతులు 75 కిలోల బస్తా రూ.1300 చొప్పున వ్యాపారికి బుధవారం విక్రయించారు. ఈ విధంగా బస్తాకు వెయ్యి రూపాయలు చొప్పున రైతులకు నష్టాలు మిగిల్చింది తుఫాను.