News April 1, 2025

ప్రవీణ్ పగడాల మృతి కేసు.. ఎస్పీ తీవ్ర హెచ్చరికలు 

image

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా SP గంగాధరరావు ఓ ప్రకటనలో హెచ్చరించారు. ప్రవీణ్ పగడాల మృతి కేసును పోలీస్ శాఖ అత్యంత పారదర్శకంగా దర్యాప్తు చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎవరైనా ఫేక్ న్యూస్‌ని స్ప్రెడ్ చేసినా, ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తించేలా వ్యాఖ్యలు చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. 

Similar News

News October 25, 2025

నేడు కలెక్టరేట్‌లో వాహనాలకు నిషేధం

image

శబ్ద, వాయు కాలుష్య నివారణలో భాగంగా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 25వ తేదీ శనివారం రోజున వాహనాలపై నిషేధం విధించారు. కలెక్టరేట్‌లో పనిచేసే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా కాలినడకన లేదా సైకిల్‌పై విధులకు హాజరు కావాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. ఆ రోజు కలెక్టరేట్ ప్రాంగణంలో ఎటువంటి మోటారు వాహనాలకు ప్రవేశం ఉండదని ఆయన స్పష్టం చేశారు.

News October 24, 2025

కృష్ణా జిల్లాలో వర్షపాతం వివరాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 46.2 మి.మీల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. అత్యధికంగా గూడూరు మండలంలో 89.2 మి.మీల వర్షపాతం నమోదు అవ్వగా అత్యల్పంగా నాగాయలంక మండలంలో 19.6మి.మీల వర్షపాతం నమోదైంది. రానున్న 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

News October 24, 2025

కృష్ణా జిల్లా DMHOగా బాధ్యతలు స్వీకరించిన డా. యుగంధర్

image

కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి(DMHO)గా డా. యుగంధర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. DMHOగా బాధ్యతలు నిర్వర్తించిన డా. శర్మిష్ట గత నెల పదవీ విరమణ చేయగా ఆమె స్థానంలో యుగంధర్ నియమితులయ్యారు. ఎముకల శస్త్ర చికిత్స నిపుణుడైన యుగంధర్ గతంలో గుడివాడ, అవనిగడ్డలో పని చేశారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా కూడా పని చేశారు. నూతన DMHOను పలువురు ఉద్యోగులు కలిసి అభినందనలు తెలిపారు.