News February 24, 2025
ప్రశాంతంగా టీజీ సెట్- 2025 ప్రవేశ పరీక్ష

ఆదివారం నిర్వహించిన టీజీ సెట్- 2025 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఆదివారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి బైపాస్ వద్ద ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో నిర్వహించిన టీజీ సెట్ ప్రవేశ పరీక్షను తనిఖీ చేశారు. ప్రవేశ పరీక్షకు మొత్తం 12,929 మంది విద్యార్థులను కేటాయించగా, పరీక్షకు 12,503 మంది విద్యార్థులు హాజరయ్యారు.
Similar News
News February 24, 2025
కనగల్: చనిపోతూ ఐదుగురికి ప్రాణదానం

కనగల్ మండలం రేగట్టే గ్రామానికి చెందిన తిరందాసు నారాయణ తను చనిపోతూ మరో ఐదుగురికి ప్రాణదానం చేశారు. చండూరులో కిరాణా షాప్ నడిపే నారాయణ ఈనెల 19న షాపు మూసి బైక్పై ఇంటికి వస్తుండగా రేగట్టే కురంపల్లి మధ్య బీటీ రోడ్డుపై అదుపుతప్పి పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తీసుకెళ్లగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. బంధువుల అంగీకారంతో నారాయణ అవయవాలను వైద్యులు సేకరించారు.
News February 24, 2025
NLG: క్విజ్.. వీటికి సమాధానాలు తెలుసా?

☞‘జల సాధన సమితి’ వ్యవస్థాపకుడు ఎవరు?
☞నాగార్జున సాగర్ ఎడమ కాలువని ఏమంటారు?
☞‘బండెనక బండి కట్టి’ గేయ రచయిత ఎవరు?
☞‘ప్రజల మనిషి’ నవలను ఎవరు రచించారు?
☞భువనగిరి కోటను ఎవరు నిర్మించారు?
★పై ప్రశ్నలకు సమాధానాలను కామెంట్ చేయగలరు?
నోట్: మధ్యాహ్నం 2 గంటలకు ఇదే ఆర్టికల్లో జవాబులను చూడొచ్చు.
SHARE IT..
News February 24, 2025
నల్గొండ: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో నల్గొండ – వరంగల్ – ఖమ్మం జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.