News May 5, 2024
ప్రశాంతంగా నీట్ పరీక్ష.. సమన్వయకర్త ఈశ్వరి ప్రభాకర్
విశాఖలో నీట్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు సమన్వయకర్త ఈశ్వరి ప్రభాకర్ తెలిపారు. ఈ పరీక్షకు 8,038 మంది దరఖాస్తు చేసుకోగా 7,861 మంది హాజరయ్యారని వివరించారు. ఇందులో 5,800 మంది బాలికలు కాగా 2,061 మంది బాలురు ఉన్నారని తెలిపారు. నగరంలో మొత్తం 13 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించినట్లు ఆమె వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు.
Similar News
News January 25, 2025
బ్యాంక్ అధికారులతో సమావేశమైన విశాఖ సీపీ
విశాఖ నగరంలో బ్యాంక్ అధికారులతో సీపీ శంఖబ్రత బాగ్చి శుక్రవారం సమావేశం అయ్యారు. సైబర్ క్రైమ్ బాధితులు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే దర్యాప్తు కోసం బ్యాంకులకు పోలీసులు సమాచారం కోరితే నెల రోజులు గడిచినా సమాచారం ఇవ్వడం లేదన్నారు. సైబర్ క్రైమ్, ఏటీఎంలలో దొంగతనం జరిగినప్పుడు పోలీసులకు బ్యాంక్ అధికారులు సహకరించాలన్నారు. బ్యాంకులు, పోలీసులు పరస్పర సహకారంతో బాధితులకు న్యాయం చేయొచన్నారు.
News January 24, 2025
గంభీరం డ్యామ్‌లో బీటెక్ విద్యార్థి మృతి
ఆనందపురం మండలం గంభీరం డ్యామ్‌లో ఈతకు వెళ్లి విద్యార్థి మీసాల నాని(20) మృతి చెందాడు. సివిల్ ఇంజినీర్ థర్డ్ ఇయర్ చదువుతున్న నాని కోమ్మదిలో ఓ ప్రవేటు హాస్టల్లో ఉంటున్నాడు. మృతుడు విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేటకు ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఆనందపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News January 24, 2025
పరిశ్రమల స్థాపనకు సంపూర్ణ సహకారం: విశాఖ కలెక్టర్
జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా సంపూర్ణ సహకారం అందించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగు హాలులో జిల్లా ఇండస్ట్రియల్ ఎగుమతి కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి అన్ని విధాలా సహకారం అందించాలని సూచించారు. భూ సేకరణ, సింగిల్ విండో క్లియరెన్స్ అంశాల్లో వేగం పెంచాలని ఆదేశించారు.