News April 2, 2025
ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు

కొత్తగూడెం జిల్లాలో మార్చి 21 నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా విద్యాధికారి ఎం వెంకటేశ్వరాచారి, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఎస్ మాధవరావు తెలిపారు. చివరగా సోషల్ స్టడీస్ పరీక్షకు 12273 మంది విద్యార్థులకు గాను 12240 విద్యార్థులు హాజరుకాగా 33 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. సప్లమెంటరీ విద్యార్థులు 26 మంది గాను 17 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు
Similar News
News October 30, 2025
వాగులో గల్లంతై అంగన్వాడీ టీచర్ మృతి

వాగులో గల్లంతై అంగన్వాడి టీచర్ మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. భువనగిరి మండలం నందనంకు చెందిన అంగన్వాడి మొదటి సెంటర్ టీచర్ కృష్ణవేణి తన తండ్రి అంత్యక్రియలకు వెళ్లి తిరిగి విధులకు వస్తుండగా ప్రమాదం జరిగింది. భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై మజీద్ పూర్- బాటసింగారం దారి నుంచి వస్తుండగా మధ్య వాగులో కొట్టుకుపోయి గల్లంతై మృతిచెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News October 30, 2025
ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం 8.30 గంటలలోపు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30-40కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News October 30, 2025
మంచిర్యాల: తనిఖీ బృందాల నియామక దరఖాస్తు గడువు పొడిగింపు

ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న విద్యా కార్యక్రమాల తనిఖీకి ఏర్పాటు చేయనున్న బృందాల్లో సభ్యులుగా నియామకానికి దరఖాస్తుల గడువు పొడిగించినట్లు మంచిర్యాల డీఈఓ యాదయ్య గురువారం తెలిపారు. అర్హత కలిగిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నస్పూర్లోని ఐడీఓసీలో ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు.


