News October 14, 2024
ప్రశాంతంగా ముగిసిన మద్యం షాపుల లక్కీ డ్రా ప్రక్రియ

జిల్లావ్యాప్తంగా మద్యం షాపులు కొరకు దరఖాస్తు చేసుకున్న వారి లక్కీ డ్రా ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. రెండు టేబుళ్లను ఏర్పాటుచేసి ఒక్కొక్క టేబుల్ వద్ద ఇద్దరు వీడియో గ్రాఫర్లతో పూర్తి ప్రక్రియను వీడియోగ్రఫీ చిత్రీకరించినట్లు చెప్పారు. ఆయా షాపులకు టెండర్లు దాఖలు చేసిన దరఖాస్తుదారుల సమక్షంలోనే లక్కీడిప్ తీసి షాపు దక్కించుకున్న వారి పేరును ప్రకటించారు.
Similar News
News February 24, 2026
నెల్లూరు: నిద్ర మాత్రలు మింగి మహిళ సూసైడ్

నెల్లూరు నగరంలోని సెట్టిగుంట రోడ్డు సీపీఆర్ వీధిలో నివాసం ఉంటున్న సుజాత (51) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఇంట్లో సమస్యలు, అనారోగ్యం ఆమెను తీవ్రంగా కలిచి వేసింది. ఈనెల 22వ తేదీన తన ఇంట్లో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 24, 2026
నెల్లూరు: తొలిరోజు 566 మంది డుమ్మా

నెల్లూరు జిల్లాలో ఇంటర్ రెండో సంవత్సరం తొలి పరీక్ష మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఆర్ఐవో వరప్రసాదరావు తెలిపారు. జిల్లాలో 81 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 26,034 మంది విద్యార్థులకు గాను 25,468 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. 566 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రకటించారు.
News February 24, 2026
నెల్లూరులో లారీ ఢీకొని బెస్ట్ ఫ్రెండ్స్ మృతి

నెల్లూరు శెట్టిగుంట రోడ్డుకు చెందిన హేమేంద్ర(22), వెంకటేశ్వరపురానికి చెందిన నూరుల్లా(20) మంచి స్నేహితులు. హేమేంద్ర కారు షోరూములో టెక్నీషియన్‌గా, నూరుల్లా ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం రాత్రి ఇద్దరు బైకుపై హైవే మీదుగా వెంకటేశ్వరపురానికి బయల్దేరారు. చెన్నై వైపు నుంచి కావలి వైపు వెళ్తున్న లారీ ఓవర్ టేక్ చేసే క్రమంలో బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో స్నేహితులు ఇద్దరూ చనిపోయారు.


