News March 13, 2025

ప్రశాంతంగా హోలీ పండుగను జరుపుకోవాలి: ఎస్పీ

image

హోలీ పండుగను జరుపుకునే వారు జాగ్రత్తలు పాటిస్తూ ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ నరసింహ సూచించారు. యువత ప్రమాదాలకు దూరంగా ఉండాలని, ద్విచక్ర వాహనాలపై వేగంగా వెళ్లవద్దని, సాంప్రదాయ రంగులు ఉపయోగించడం ఆరోగ్యకరమని అన్నారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా సాంప్రదాయక పండుగలు ఏమైనా ప్రజలు కలిసి మెలిసి ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలన్నారు.

Similar News

News November 20, 2025

ఒంగోలు మాజీ MP హత్యలో అతనే సూత్రధారి..?

image

మావోయిస్ట్ జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే సుమారు 37ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న టెక్ శంకర్ పలు మావోయిస్ట్ ఆపరేషన్స్‌లో పాల్గొన్నారు. అందులో 1995 డిసెంబర్ 1న ఒంగోలు మాజీ MP మాగుంట సుబ్బరామిరెడ్డిపై మావోయిస్టులు జరిపిన కాల్పుల కేసులో సైతం టెక్ శంకర్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

News November 20, 2025

ఎట్టకేలకు బదిలీలు.. వరుస వివాదాల నేపథ్యంలో చర్యలు!

image

వేములవాడ రాజన్న ఆలయంలో ఎట్టకేలకు ఉద్యోగుల అంతర్గత బదిలీలు చేపట్టారు. ఓ ఉద్యోగి అక్రమంగా సరకులు తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. విచారణ జరిపి చర్య తీసుకోవడానికి బదులుగా మీడియాపై ఎదురుదాడికి దిగడం, వార్తల కవరేజీకి సహకరించకపోవడం పట్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమయ్యారు. BJP ఈ ఆందోళనకు మద్దతు ప్రకటించింది. నేడు ధర్నా ప్రకటించడంతో దిగివచ్చిన ఆలయ అధికారులు అంతర్గత బదిలీలు చేపట్టారు.

News November 20, 2025

HYD: ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకోనున్న సీసీఎస్ పోలీసులు

image

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ మూవీ రాకెట్‌ ఐబొమ్మ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మడి రవిని నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. వారం రోజులు రవిని కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా 5 రోజులకు అనుమతి ఇచ్చింది. రవిని నేడు చంచల్‌గూడ జైలు నుంచి సీసీఎస్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు.