News March 13, 2025
ప్రశాంతంగా హోలీ పండుగను జరుపుకోవాలి: ఎస్పీ

హోలీ పండుగను జరుపుకునే వారు జాగ్రత్తలు పాటిస్తూ ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ నరసింహ సూచించారు. యువత ప్రమాదాలకు దూరంగా ఉండాలని, ద్విచక్ర వాహనాలపై వేగంగా వెళ్లవద్దని, సాంప్రదాయ రంగులు ఉపయోగించడం ఆరోగ్యకరమని అన్నారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా సాంప్రదాయక పండుగలు ఏమైనా ప్రజలు కలిసి మెలిసి ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలన్నారు.
Similar News
News March 27, 2025
జడ్పీ కోఆప్షన్ మెంబర్‌గా మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్

ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్‌గా వైసీపీ నేత మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం కర్నూలులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నికైన మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్‌తో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి పీ.రంజిత్ బాషా ప్రమాణ స్వీకారం చేయించారు. జడ్పీ ఛైర్మన్ పాపిరెడ్డి, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
News March 27, 2025
కన్నడిగులకు మరో షాక్!

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. పాల ధరలను లీటరుకు రూ.4 పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెంచిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మిల్క్ ధరలను లీటరుకు రూ.5 పెంచాలని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) కోరగా సీఎం సిద్దరామయ్య రూ.4 పెంచేందుకు అంగీకరించారు. ఇటీవలే అక్కడ కరెంట్ ఛార్జీలను పెంచారు. 6 గ్యారంటీలే ధరల పెరుగుదలకు కారణమని విపక్షాలు మండిపడుతున్నాయి.
News March 27, 2025
గూడూరులో డెడ్ బాడీ కలకలం

గూడూరు పట్టణ శివారులోని టిడ్కో ఇళ్ల సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం ఇవాళ కలకలం రేపింది. టిడ్కో గృహాల పక్కనే ఉన్న కంపచెట్ల పొదల్లో ఓ మృతదేహం కుళ్లిపోయి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారం రోజుల క్రితం ఓ మహిళ తన కుమారుడు సోహెల్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఉన్నారు. పోలీసులు సోహెల్ మృతదేహంగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.