News February 15, 2025

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి: కలెక్టర్

image

తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు అధికారులు ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి స్పష్టం చేశారు. ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఏలూరు జిల్లాలో 87 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News December 1, 2025

మీది పొడిచర్మమా? అయితే ఇలా చేయండి

image

బాడీలో సెబాషియన్ గ్రంధుల ద్వారా కొన్ని జిడ్డు పదార్థాలు తక్కువగా ప్రొడ్యూస్ అయినపుడు చర్మం పొడిగా, నిర్జీవంగా ఉంటుంది. దాన్నే డ్రై స్కిన్ టైప్ అంటున్నారు నిపుణులు. ఈ టైప్ స్కిన్‌కి ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. ఇన్‌ఫెక్షన్లు సోకితే ముక్కు, కనుబొమ్మల చుట్టూ దద్దుర్లు వస్తాయి. ఈ స్కిన్ టైప్ వారు సున్నితమైన క్లెన్సర్&హ్యూమెక్టెంట్స్ ఉండే మాయిశ్చరైజర్‌ని ఎంచుకుంటే చర్మం తేమగా, తాజాగా ఉంటుందంటున్నారు.

News December 1, 2025

అర్జీల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: కలెక్టర్

image

పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ప్రజలు అందిస్తున్న అర్జీల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు చేపడతామని కలెక్టర్ మహేశ్ కుమార్ హెచ్చరించారు. సోమవారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయన పీజీఆర్ఎస్‌ను నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, మొత్తం 135 అర్జీలను స్వీకరించారు.

News December 1, 2025

దూడల్లో నట్టల బెడద – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

దూడలకు నట్టల బెడద సర్వసాధారణం. ఈ సమస్య గేదె దూడలలో ఎక్కువగా వస్తుంది. దూడల్లో నట్టల సమస్య ఉంటే వాటికి తరచూ విరేచనాలు అయ్యి దూడ పెరుగుదల సక్రమంగా ఉండదు. వెంట్రుకలు బిరుసుగా ఉండి, నడుము కిందికి జారి ఉంటుంది. దవడల మధ్య నీరు చేరుతుంది. ఈ సమస్య కట్టడికి దూడ పుట్టిన ఎనిమిది రోజులలో తొలిసారి, తర్వాత ప్రతి నెలకు ఒకసారి చొప్పున ఆరు నెలల వయసు వచ్చేవరకు వెటర్నరీ నిపుణుల సూచనలతో నట్టల మందు తాగించాలి.