News August 30, 2024
ప్రశాంత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి: వెస్ట్ జోన్ డీసీపీ
జనగామలో గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రానున్న గణపతి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉత్సవ కమిటీ సభ్యులదే అని అన్నారు. ఇతర మతాల వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దన్నారు.
Similar News
News September 15, 2024
నిమజ్జనం సందర్భంగా వరంగల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
గణపతి నిమజ్జనం సందర్భంగా వరంగల్ ట్రైసిటీస్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ తెలిపారు. ఈ ఆంక్షలు సోమవారం మధ్యాహ్నం 12 నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. ఖమ్మం, ములుగు, నర్సంపేట, హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లు ఆంక్షలు తప్పక పాటించాలని తెలిపారు.
News September 15, 2024
వరంగల్: రేపే నిమజ్జనం.. జర భద్రం
గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ముగిస్తుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం గణనాథుడి నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. గ్రేటర్ పరిధిలోని పద్మాక్షి గుండం, బంధం చెరువు, చిన్న వడ్డేపల్లి, ఉర్సు, కోట, బెస్తం చెరువు, ఇతర ప్రాంతాల్లో నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరి మీ గణేశుడి నిమజ్జనం ఎప్పుడు? కామెంట్ చేయండి.
News September 15, 2024
వరంగల్: నిమజ్జనం కోసం చెరువులో పూడిక తీసివేత
వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో చెరువుల్లో గణేశ్ నిమజ్జనం కోసం పూడికతీత పనులను చేపట్టారు. గ్రేటర్ వరంగల్ ఆధ్వర్యంలో భారీ జేసీబీలతో హసన్పర్తి, కాజీపేట బంధం చెరువు, ములుగు రోడ్డులోని కోట చెరువు, దేశాయిపేట, గొర్రెకుంట, చిన్న వడ్డేపల్లి, ఖలా వరంగల్ గుండు చెరువు, రంగ సముద్రం రంగశాయిపేట బెస్తం చెరువులో పేరుకుపోయిన వ్యర్థాలు, గుర్రపు డెక్కను తొలగించారు.