News February 1, 2025

ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలి: కలెక్టర్

image

అనకాపల్లి జిల్లాలో వచ్చేనెల ఐదు నుంచి జరగనున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఇంటర్ అధికారులకు సూచించారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలపై శుక్రవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను చేయాలన్నారు. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

Similar News

News December 1, 2025

ఆలోచనలను ఆదాయ వనరుగా మార్చారు

image

2014లో నాలుగు ఆవుల్ని కొన్న శ్రీకాంత్, చార్మి దంపతులు అహ్మదాబాద్‌లో వాటిని పెంచుతూ తొలుత పాలు, నెయ్యి, పనీర్ అమ్మారు. ఈ వృత్తినే ఒక ఆదాయ వనరుగా మలచుకోవాలనుకున్నారు. ఆవుల సంఖ్య పెంచి ‘గౌనీతి ఆర్గానిక్’ పేరుతో వ్యాపారం ప్రారంభించారు. పాలు, నెయ్యి, పన్నీరుతో న్యూట్రి బార్లు, లిప్ బామ్ వంటి ఆర్గానిక్ ఉత్పత్తులను, ఆవు పేడతో తయారు చేసిన ధూపం, అగర్ బత్తి వంటి వాటిని తమ ఇంటి వద్దనే అమ్మడం ప్రారంభించారు.

News December 1, 2025

ఇతిహాసాలు క్విజ్ – 83

image

ఈరోజు ప్రశ్న: శివారాధనకు సోమవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అందుకు కారణమేంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 1, 2025

TCILలో 150 పోస్టులు.. అప్లై చేశారా?

image

టెలి కమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (TCIL)లో 150 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ITI, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు DEC 9 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్‌, డాక్యుమెంట్స్‌ను tcilksa@tcil.net.in, tcilksahr@gmail.comకు ఇ మెయిల్ ద్వారా పంపాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.tcil.net.in/