News March 13, 2025
ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి: ఎస్పీ

జిల్లాలోని ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో హోలీని జరుపుకోవాలని గురువారం జిల్లా ఎస్పీ వి.రత్న తెలిపారు. ఈ సందర్భంగా ముందుగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఉన్నాయని, ఎవరూ గొడవలకు వెళ్లకూడదని తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో ప్రజలకు స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా ప్రవర్తించరాదన్నారు.
Similar News
News February 9, 2026
‘సావర్కర్‌కు భారతరత్న’పై మాటల మంటలు

వీర్ సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలన్న RSS చీఫ్ మోహన్ భాగవత్ కామెంట్స్‌తో మరోసారి చర్చ మొదలైంది. అసలు ఆయన దేశానికి ఏం సేవ చేశారని ఆ బిరుదు ఇవ్వాలని కాంగ్రెస్, MIM ఘాటుగా ప్రశ్నించాయి. అటు భారతరత్న కంటే సావర్కర్‌ది ఎంతో పెద్ద స్థాయి అని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కామెంట్ చేశారు. సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌పై మీ అభిప్రాయం కామెంట్ చేయండి.
News February 9, 2026
శ్రీకాకుళం: ఎస్పీ పీజీఆర్ఎస్‌లో 53 వినతులు

జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో 53 వినతులు అందినట్లు అదనపు ఎస్పీ కె.వి. రమణ తెలిపారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. అందిన వినతులపై తక్షణమే స్పందించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
News February 9, 2026
పోలింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాష అధికారులను ఆదేశించారు. సోమవారం ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, సంబంధిత ఎన్నికల అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిస్ట్రిబ్యూటషన్ సెంటర్లో వసతులు బాగుండాలని అధికారులను ఆదేశించారు.


