News March 22, 2025
ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు 38 కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు డీఈవో కృష్ణప్ప తెలిపారు. శనివారం నిర్వహించిన పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 1,337 మందికి గాను 1,335 మంది హాజరయ్యారన్నారు. ప్రైవేట్ విద్యార్థులు 8 మందికి గాను ముగ్గురు హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 1,345 మందికి గాను 1,338 మంది పరీక్షలకు హాజరు కాగా.. ఏడుగురు గైర్హాజరయ్యారని తెలిపారు.
Similar News
News March 29, 2025
గురుకులాల్లో ప్రవేశాలు.. దరఖాస్తు గడువు పెంపు

AP: గురుకుల స్కూళ్లలో ఐదో తరగతి ప్రవేశాలతో పాటు 6, 7, 8 తరగతుల్లోని మిగిలిన ఖాళీల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును పొడిగించినట్లు అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 6లోగా https://aprs.apcfss.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్ సీట్ల భర్తీకి నిర్వహించే పరీక్షకు కూడా ఏప్రిల్ 6 వరకు అప్లై చేసుకోవచ్చని సూచించారు.
News March 29, 2025
బేగంపేట AIRPORT కింద సొరంగం.. గ్రీన్ సిగ్నల్ !

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం రన్‌వే కింద నుంచి 600 మీటర్ల పొడవు HMDA ఎలివేటెడ్ కారిడార్ అలైన్మెంట్ తీసుకెళ్తున్నట్లు HYD మెట్రో రైల్ సంస్థ తెలిపింది. ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి వరకు స్ట్రీప్ కర్వ్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. విమానాశ్రయం కింద సొరంగం నిర్మించేందుకు AAI తాజాగా అనుమతి లభించగా.. HMDA టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
News March 29, 2025
ఓరియంట్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు అందుకున్న అంజనప్ప

అనంతపురం జిల్లాకు చెందిన తేనే తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్.అంజనప్ప శుక్రవారం ఓరియంట్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు అందుకున్నారు. కనుమరుగవుతున్న కళా రూపాలకు పూర్వ వైభవం తీసుకురావాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలలో 221 కళాభిషేకం కార్యక్రమాలు పూర్తి చేసినందుకుగాను ఓరియంట్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు అవార్డు దక్కిందని తెలిపారు.