News March 23, 2024
ప్రసన్నకు కౌంటర్ గా రేపు కోటంరెడ్డి సమావేశం

తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులపై కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రెండు రోజులుగా విమర్శల వేడి పెంచారు. ఈ క్రమంలో ఆయనకు కౌంటర్ ఇచ్చేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సన్నద్ధమయ్యారు. ఆదివారం ఉదయం 9 గంటలకు నెల్లూరులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.
Similar News
News April 19, 2026
నెల్లూరులో నేడు బంగారం ధర ఎంతంటే?

అక్షయ తృతీయ కావడంతో నెల్లూరులోని బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. నెల్లూరులో ఆదివారం గ్రాము బంగారం రూ.14,708 పలుకుతోంది. సవర(8గ్రాములు) రూ.1,17,664 చొప్పున విక్రయిస్తున్నారు. వెండి గ్రాము రూ.270.30గా ఉంది. అక్షయ తృతీయలో కనీసం గ్రాము బంగారమైనా కొనాలని పలువురు ఆసక్తి చూపుతున్నారు.
News April 19, 2026
నెల్లూరు: ఆ నిధులు ఖర్చు చేసేది ఎలా..?

నెల్లూరు జిల్లాలోని 700 గ్రామాల్లో రూ.39 కోట్ల పన్ను బకాయిలు ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.33.88 కోట్లు రాబట్టారు. ఈ నిధులను ఖర్చు చేద్దామనుకొనే లోపు సర్పంచుల పదవీ కాలం ముగిసిపోయింది. స్పెషల్ ఆఫీసర్స్ వచ్చినా.. వీరికి నిధులు వ్యయంపై అవగాహన లేకపోవడం, పల్లెల ముఖం చూడకపోవడంతో నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉంది. వేసవిలో నీటి కష్టాల తీర్చడానికి ఈ నిధులు ఖర్చు చేస్తే బాగుంటుంది.
News April 19, 2026
నెల్లూరు జిల్లాలో 212మంది పోలీసుల బదిలీ

నెల్లూరు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 5ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న 212 మంది సిబ్బందిని ట్రాన్స్‌ఫర్ చేశారు. SP అజిత వేజెండ్ల సిబ్బందితో మాట్లాడి పారదర్శకంగా బదిలీలు చేపట్టారు. అన్ని విభాగాల నుంచి ఖాళీల వివరాలను సేకరించారు. సిబ్బంది అభ్యర్థనలు, అవసరాలను పరిగణలోకి తీసుకుని ట్రాన్స్‌ఫర్ చేశారు. బదిలీ అయిన వారిలో కానిస్టేబుళ్ల నుంచి ఏఎస్ఐ స్థాయి వరకు ఉన్న సిబ్బంది ఉన్నారు.


