News February 3, 2025

ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: డీఐఈఓ

image

నేటి(సోమవారం) నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు జనగామ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈఓ జితేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా మొత్తంలో జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 4,714 మంది పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం మొత్తం 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగనున్నాయని తెలిపారు.

Similar News

News November 21, 2025

HMపై నంద్యాల కలెక్టర్ ఆగ్రహం

image

నంద్యాలలోని నందమూరి నగర్‌లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్‌ను కలెక్టర్ రాజకుమారి శుక్రవారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. పాఠశాల పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటంతో ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు, విద్యార్థినులకు ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్నప్పటికీ అవి అపరిశుభ్రంగా ఉన్నాయని విద్యార్థులు కలెక్టర్‌కు వివరించారు.

News November 21, 2025

తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో<<18346724>> గంటల<<>> వ్యవధిలోనే బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఉదయం స్వల్పంగా పెరగ్గా.. ఇప్పుడు రూ.500 తగ్గి రూ.1,23,980కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.450 పతనమై రూ.1,13,650 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఉదయం నుంచి ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,61,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 21, 2025

ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌.. ఈ దేశాల్లోనూ చెల్లుబాటు

image

ఇండియాలో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్సులు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఫ్రాన్స్, యూకే, జర్మనీ, స్వీడన్, మలేషియా, స్పెయిన్, కెనడా, నార్వే, ఐర్లాండ్‌లో 6 నెలల నుంచి సంవత్సరం వరకు చెల్లుబాటవుతాయి. అయితే అవి ఇంగ్లిష్‌లో ప్రింట్ అయ్యుండాలి. మారిషస్‌లో ఇండియా డ్రైవింగ్ లైసెన్స్ 24 గంటలు మాత్రమే చెల్లుతుంది. ఇటలీలో మన లైసెన్స్‌తోపాటు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఉంటేనే డ్రైవింగ్‌కు అనుమతి ఉంటుంది.