News November 21, 2024

ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి: కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు

image

కర్నూలు జిల్లాలోని నీటి ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని సీఎం నారా చంద్రబాబునాయుడును జిల్లా ఎమ్మెల్యేలు కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి కట్టుబడి ఉన్నామని సీఎం హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

Similar News

News November 24, 2024

రేపు కలెక్టరేట్లో గ్రీవెన్స్ కార్యక్రమం: కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యలు పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్, రెవెన్యూ కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. సునయన ఆడిటోరియంలో నేరుగా బాధితులు వచ్చి తమ సమస్యలను విన్నవించుకోవచ్చు అన్నారు.

News November 24, 2024

ఆదోనిలో ఆటో బోల్తా పడి మహిళ మృతి

image

ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో వేగంగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి ఆటో బోల్తా పడి బళ్లారికి చెందిన మహంకాళమ్మ(50) అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. తారపురం ఆంజనేయ స్వామిని దర్శించుకుని వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు.

News November 24, 2024

కర్నూలు: కన్నీరు పెట్టిస్తున్న వెల్లుల్లి ధరలు

image

కర్నూలు జిల్లాలో వెల్లుల్లి ధరలు ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తున్నాయి. రకాన్ని బట్టి కిలో రూ.350 -.400పైనే ధర పలుకుతోందంటూ ప్రజలు వాపోయారు. ఇతర రాష్ట్రాలలో వెల్లుల్లి దిగుబడులు భారీగా తగ్గిపోవడంతోనే రేట్లు అమాంతం పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. మొన్నటి వరకు కన్నీరు పెట్టించిన ఉల్లి.. కొంత ఉపశమనం కలిగించినా, వెల్లుల్లి ధర కన్నీరు పెట్టిస్తోంది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి