News August 22, 2024
ప్రాజెక్ట్ భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి: సృజన
జిల్లా పరిధిలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సృజన ఆదేశించారు. గురువారం విజయవాడ కలెక్టరేట్‌లో జాతీయ రహదారులు, రైల్వేలకు సంబంధించి వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియపై ఆమె సమావేశం నిర్వహించారు. భూ సేకరణ విస్తీర్ణం, అవార్డు పాస్ వివరాలు, ప్రక్రియ ఏ దశలో ఉందనే వివరాల ఆరా తీశారు.
Similar News
News September 13, 2024
కృష్ణా: ఎం-ఫార్మసీ పరీక్షల టైంటేబుల్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఎం-ఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. సెప్టెంబర్ 23, 24, 25, 26 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వర్సిటీ పరిధిలోని 2 కాలేజీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. పూర్తి వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
News September 13, 2024
కృష్ణా: బ్లాక్ స్పాట్స్ గుర్తించడంతో రోడ్డు ప్రమాదాల నివారణ
జిల్లాలో బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించడం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి సమీక్షించారు.
News September 13, 2024
గంపలగూడెం: ఒకే ఇంట్లో 100 వరకు పాములు
గంపలగూడెం మండల కేంద్రంలోని పడమట దళితవాడకు చెందిన రజిని ఇంటి ఆవరణలో 100 వరకు పాములు కలకలం రేపాయి. ప్రహారికి పడ్డ కన్నంలో పాములు కనిపించాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒకే చోట చేరి గుట్టగా తయారైనట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. వాటిని గమనించిన ఆ ఇంటి యజమానులు, చుట్టుపక్కల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే వాటిని బయటకు తీసేందుకు ఎవరూ ధైర్యం చేయడం లేదు.