News July 16, 2024
ప్రాణాలు కాపాడిన గుత్తి ప్రభుత్వ వైద్యులు

గుండెపోటుకు గురైన నంద్యాల జిల్లా వ్యక్తికి క్షణం ఆలస్యం చేయకుండా వైద్యం అందించి గుత్తి డాక్టర్లు బతికించారు. డోన్ మండలం కొత్త బురుజుల గ్రామానికి చెందిన చిన్న ఓబులేసు అనంతపురం వెళ్తుండగా గుత్తి సమీపంలో ఛాతీ నొప్పికి గురయ్యారు. వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎల్లప్ప గుండెపోటును నివారించే ఇంజక్షన్ ఇచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించారు.
Similar News
News November 21, 2025
సర్వీస్ నుంచి కర్నూలు సీఐ శంకరయ్య డిస్మిస్

సీఐ జె.శంకరయ్యను పోలీస్ శాఖ సర్వీస్ నుంచి డిస్మిస్ (తొలగింపు) చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం శంకరయ్య కర్నూలు వీఆర్లో ఉంటూ సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. శంకరయ్యను క్రమశిక్షణా చర్యలపై డిస్మిస్ చేసినట్లు ఆయన తెలిపారు.
News November 21, 2025
PMAY-G పేరు నమోదు చేసుకోండి: కలెక్టర్

కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ (PMAY-G 2.0) కింద గృహాల కోసం లబ్ధిదారుల పేర్ల నమోదు చేసుకోవాలని కర్నూలు కలెక్టర్ డా.సిరి సూచించారు. గ్రామ/వార్డు సచివాలయంలో పేర్ల నమోదుకు ఈ నెల 30లోపు పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News November 20, 2025
పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకూడదు: కలెక్టర్

గూడూరు మండలం పెంచికలపాడు సమీపంలోని మంజీత్ కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ & ప్రెసింగ్ యూనిట్లో సీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఏ.సిరి పరిశీలించారు. రైతులతో మాట్లాడిన ఆమె.. పత్తి సేకరణ, కొలతలు, రేట్లపై సమాచారం తీసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సకాలంలో చెల్లింపులు చేయాలని సీసీఐ అధికారులను ఆదేశించారు.


