News February 18, 2025

ప్రాణాలు తీసిన వాట్సాప్ చాటింగ్

image

వాట్సాప్ చాటింగ్‌ బాలుడి ప్రాణాలు తీసిన ఘటన భద్రాద్రి జిల్లాలో జరిగింది. SI రవికుమార్ వివరాల ప్రకారం.. చుంచుపల్లి మం. ఓ తండాకు చెందిన బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. బాలుడికి తన క్లాస్‌మేట్‌ బాలికతో స్నేహం ఉండటంతో వాట్సాప్‌లో చాట్ చేస్తుండేవాడు. బాలిక కుటుంబ సభ్యులు బాలుడిని మందలించారు. దీంతో మనస్తాపం చెంది పురుగుమందు తాగాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News December 3, 2025

ఖమ్మం: నేటి నుంచి మూడో విడత నామినేషన్ల పర్వం

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్ల స్వీకరణ నేటి(బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి సహా మొత్తం 7 మండలాల్లో అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయవచ్చు. ఈ విడతలో మొత్తం 191 గ్రామ పంచాయతీలు, 1,742 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లను ఈ నెల 5 వరకు స్వీకరిస్తారని అధికారులు తెలిపారు.

News December 3, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} ఖమ్మంలో రెండో విడత నామినేషన్ల పరిశీలన
∆} మధిర ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన

News December 3, 2025

ఖమ్మం: రెండో విడతలో భారీగా దాఖలైన నామినేషన్లు

image

జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు మంగళవారం భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయని అధికారులు తెలిపారు. రెండో విడతలో 6 మండలాలకు కలిపి మొత్తం 183 సర్పంచ్ల పదవికి గాను 1055 మంది, అటు 1686 వార్డు స్థానాలకు గాను 4160 నామినేషన్లు దాఖలు అయినట్లు చెప్పారు. కాగా దాఖలైన నామినేషన్లను నేటి నుంచి ఆయా కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో పరిశీలన జరగనుంది.