News February 18, 2025

ప్రాణాలు తీసిన వాట్సాప్ చాటింగ్

image

వాట్సాప్ చాటింగ్‌ బాలుడి ప్రాణాలు తీసిన ఘటన భద్రాద్రి జిల్లాలో జరిగింది. SI రవికుమార్ వివరాల ప్రకారం.. చుంచుపల్లి మం. ఓ తండాకు చెందిన బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. బాలుడికి తన క్లాస్‌మేట్‌ బాలికతో స్నేహం ఉండటంతో వాట్సాప్‌లో చాట్ చేస్తుండేవాడు. బాలిక కుటుంబ సభ్యులు బాలుడిని మందలించారు. దీంతో మనస్తాపం చెంది పురుగుమందు తాగాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News April 17, 2026

శ్రీకాళహస్తి గుడిలో భారీ మార్పులు ఇవే..!

image

శ్రీకాళహస్తి గుడిలో జరిగే రాహుకేతు పూజల్లో భారీ మార్పులు చేశారు. ప్రారంభం టికెట్ రూ.500 ఉండగా దాన్ని రద్దు చేశారు. రూ.750, రూ.1500, రూ.2500 యథావిధిగా కొనసాగుతాయి. రూ.5వేల టికెట్‌ను రూ.6వేలకు పెంచారు. శ్రీకాళహస్తి లోకల్ ప్రజలకు తెల్ల రేషన్ కార్డు ఉంటే ప్రతి బుధవారం రూ.100లకే 2వేల మందితో సామూహికంగా రాహు కేతు పూజ చేయిస్తారు.

News April 17, 2026

GNT: తెనాలిలో న్యూడ్ వీడియో కాల్స్ (UPDATE)

image

గుంటూరు (D) తెనాలిలో చెంచుపేట కేంద్రంగా న్యూడ్ వీడియో కాల్స్ దందా వెలుగులోకి వచ్చిన <<19645040>>విషయం తెలిసిందే.<<>> ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా మహిళలతో న్యూడ్ వీడియో కాల్స్ చేయిస్తున్న వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని విచారించారు. వీరిలో ఒకరి కుమారుడు పరారీలో ఉండగా గాలిస్తున్నట్లు పోలీసుల తెలిపారు. లీగల్ ఒపీనియన్‌తో గురువారం రాత్రి సుమోటోగా కేసు నమోదు చేశామన్నారు.

News April 17, 2026

హైదరాబాద్‌లో మరో సైబర్ టవర్!

image

TG: హైదరాబాద్‌లో ఐటీ విప్లవానికి గుర్తుగా నిలిచిన సైబర్ టవర్స్ తరహాలో మరో అత్యాధునిక పరిపాలనా భవనం నిర్మితం కానుంది. కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కోసం ఐకానిక్ బిల్డింగ్‌ను 8 అంతస్తుల్లో నిర్మించనున్నారు. దీనికి రూ.200 కోట్లతో ఇంజినీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన ఫైలును సీఎం పరిశీలనకు పంపారు. కైత్లాపూర్‌లోని ఐదెకరాల భూమిని అధికారులు ఎంపిక చేశారు.