News April 2, 2025
ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: ASF SP

యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, నిషేధిత ప్లే కార్డ్స్, గేమింగ్ యాప్‌లకు, IPL బెట్టింగ్ లకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తక్కువ సమయంలో సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న భ్రమలో యాప్‌లకు బానిసలవుతున్నట్లు చెప్పారు. యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్‌కు ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు.
Similar News
News November 16, 2025
రాజస్థాన్ కొత్త CSగా ఓయూ ఓల్డ్ స్టూడెంట్

రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి. 1987లో బీటెక్ (కెమికల్ ఇంజినీరింగ్), ఆ తరువాత ఎంటెక్ పూర్తిచేసిన శ్రీనివాస్ సివిల్స్‌లో విజయం సాధించి ఐఏఎస్ అధికారిగా నియమితులయ్యారు. అనేక పదవుల్లో పనిచేసిన ఆయన తాజాగా రాజస్థాన్ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈనెల 17న శ్రీనివాస్ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.
News November 16, 2025
దిష్టిలో ఉన్న శాస్త్రీయత ఏమిటి..?

చిన్నపిల్లలు ఆహారం సరిగా తీనకపోయినా, విరేచనాలైనా దిష్టి తగిలిందని పెద్దలు అంటుంటారు. దిష్టి తీశాక పిల్లలు చలాకీగా ఆడుకుంటారు. దీని వెనకున్న సైన్స్ ఏంటంటే.. మన కళ్లకు సౌమ్యదృష్టి, క్రూర దృష్టి అనేవి ఉంటాయి. ఈ చూపుల ప్రభావంతో శరీరం నలతకు గురవుతుంది. ఉప్పు, మిరపకాయతో దిగదీయుట, వాటిని నిప్పులో వేయుట వలన వచ్చే పొగ ముక్కు ద్వారా పీల్చుకోవడం వలన నలత దూరమై, శరీరాన్ని తేలిక చేస్తుంది. <<-se>>#Scienceinbelief<<>>
News November 16, 2025
కర్మయోగి భారత్‌లో ఉద్యోగాలు

కర్మయోగి భారత్ 8 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, B.COM, B.Sc, బీటెక్, BE, LLB, PG, M.Sc, ME, ఎంటెక్, MBA, PGDM, MCA ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: igotkarmayogi.gov.in


