News September 1, 2024
ప్రాణ నష్టాన్ని నివారించాం: కృష్ణా కలెక్టర్
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా ప్రాణ నష్టం వాటిల్ల లేదని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శనివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. 25 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని.. వెంటనే పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నామన్నారు. విద్యుత్ ప్రమాదాలు నివారించేందుకు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపి వేసినట్లు తెలిపారు.
Similar News
News September 13, 2024
ఆయుధాగారాన్ని తనిఖీ చేసిన ఎస్పీ గంగాధర్
ఎస్పీ ఆర్. గంగాధర్ శుక్రవారం మచిలీపట్నంలోని జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆయుధాగారాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా ఆయన అక్కడి ఆయుధాలను స్వయంగా పరిశీలించారు. ఆర్మోరర్ వర్క్ షాప్, యాంటీ రోయిట్ సామాగ్రి, మందు గుండు సామాగ్రి యొక్క నిర్వహణ, రికార్డుల నిర్వహణను పరిశీలించిన ఎస్పీ.. ఆయుధాగార నిర్వహణ పట్ల సంతృప్తిని వ్యక్తపరిచారు.
News September 13, 2024
కృష్ణా: ఎం-ఫార్మసీ పరీక్షల టైంటేబుల్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఎం-ఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. సెప్టెంబర్ 23, 24, 25, 26 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వర్సిటీ పరిధిలోని 2 కాలేజీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. పూర్తి వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
News September 13, 2024
కృష్ణా: బ్లాక్ స్పాట్స్ గుర్తించడంతో రోడ్డు ప్రమాదాల నివారణ
జిల్లాలో బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించడం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి సమీక్షించారు.