News April 10, 2025
ప్రాథమిక సహకార సంఘాల బలోపేతానికై చర్యలు: అదనపు కలెక్టర్

జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతానికి, నూతన సంఘాల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో సంఘాలకు సంబంధించిన అంశాలపై నాబార్డ్, జిల్లా అభివృద్ధి, సహకార, వ్యవసాయ, పౌరసరఫరాల, మత్స్య, మార్కెటింగ్, పశుసంవర్ధక, డైరీ శాఖ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. సంఘాలతో సోలార్, పెట్రోల్ బంక్, ఈసేవ, కామన్ సర్వీస్ సెంటర్లపై అధికారులతో చర్చించారు.
Similar News
News December 5, 2025
మెదక్ జిల్లాలో 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

మెదక్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 160 పంచాయతీలకు 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. అదే విదంగా జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఎన్నికలు జరిగే 1,402 వార్డులకు గాను 332 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని చెప్పారు. ఇందులో 14 గ్రామాల సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం అయినట్లు వివరించారు.
News December 5, 2025
సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు: కలెక్టర్

ఏలూరు జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కు తెలియజేసారు. ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం ప్రధానమంత్రి సీజనల్ వ్యాధుల నియంత్రణ, వైద్యఆరోగ్య సేవలు, ధాన్యం సేకరణ, ఎరువులు పంపిణీ, ప్రభుత్వ సేవలలో ప్రజల సంతృప్తి స్థాయి తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్లో చర్చించారు.
News December 5, 2025
చంద్రుగొండలో రేషన్ బియ్యం పట్టివేత

చంద్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ స్థాయిలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా 280 క్వింటాళ్ల రేషన్ బియ్యం (విలువ రూ.5.60 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ అరుణ్కుమార్, రాజ్బార్ విచారణలో బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఛత్తీస్గఢ్కు అధిక ధరలకు తరలిస్తున్నట్లు ఒప్పుకొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.


