News January 28, 2025

ప్రాథమిక స్థాయిలో గుణాత్మక విద్య అందించాలి: కలెక్టర్

image

ప్రాథమిక స్థాయిలో గుణాత్మక విద్య అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు.బుధవారం విద్యాశాఖ సమీక్ష చేశారు. మెదక్ జిల్లా ఈ విద్యా సంవత్సరం ఇప్పటివరకు జరిగిన ప్రాథమిక స్థాయి విద్యాబోధన పురోగతిపై సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ సభ్యులు కలెక్టర్ కు వివరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాబోవు విద్యా సంవత్సరంలో మొదటి, ద్వితీయ తరగతి నుండి స్థాయి గుణాత్మక విద్య అందించే దిశగా అడుగులు వేయాలి.

Similar News

News February 16, 2025

మెదక్: తమ్ముడిని కొట్టి చంపి.. ఆపై!

image

తమ్ముడిని హత్య చేసిన అన్నను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. మునిపల్లి మండలం చీలపల్లి చెందిన శివయ్యను శుక్రవారం సాయంత్రం తన అన్న యాదయ్య హత్య చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం యాదయ్య పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. విచారణలో శివయ్యను బండరాయితో కొట్టి చంపినట్లు ఒప్పుకున్నాడని, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

News February 16, 2025

MDK: మ్యాట్రిమోని పేరుతో డబ్బులు వసూలు.. నిందితుడి అరెస్ట్

image

మ్యాట్రిమోని పేరుతో అమ్మాయిలతో పరిచయం పెంచుకొని డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న నిందితుడిని చేర్యాల పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. చేర్యాల సీఐ తెలిపిన వివరాలు.. కర్నూల్‌కు చెందిన గుమ్మనా వివేకానంద రెడ్డి చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. తర్వాత అమ్మాయి నుంచి రూ.5 లక్షలకు పైగా వసూలు చేసినట్టు తెలిపారు. మోస పోయిన అమ్మాయి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు.

News February 16, 2025

మెదక్: ఈనెల 17 నుంచి టెన్త్ ప్రాక్టీస్-2 ఎగ్జామ్స్

image

పదవ తరగతి విద్యార్థులకు ప్రాక్టీస్-2 పరీక్షలు ఈనెల 17 నుంచి 24 వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. ఈ నెల 17న తెలుగు, 18న హిందీ, 19న ఇంగ్లీష్, 20న గణితం, 21న భౌతిక రసాయన శాస్త్రం, 22న జీవశాస్త్రం, 24న సాంఘిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఈ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచించారు.

error: Content is protected !!