News April 25, 2024
ప్రారంభమైన ఎనుమాముల మార్కెట్
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సాధారణ సెలవుల అనంతరం నేడు మార్కెట్లో క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. కావున ఈ విషయాన్ని రైతులందరూ గమనించాలని మార్కెట్ అధికారులు తెలిపారు. రైతులు తమ సరుకులు మార్కెట్కు తరలించే సమయంలో పలు సూచనలు, జాగ్రత్తలు పాటిస్తే మంచి ధర పలుకుతుందని అధికారులు తెలిపారు.
Similar News
News January 11, 2025
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..
> HNK: విద్యుత్ షాక్ తో ఒకరి మృతి..> MLG: మూడు పల్టీలు కొట్టిన కారు..> JN: పాలకుర్తిలో తప్పిన ప్రమాదం.. బస్సు కిందికి దూసుకెళ్లిన బైకు > MHBD: బామ్మర్దిపై కత్తితో బావ దాడి> WGL: ఈర్యా తండా సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు> JN: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి> WGL: రోడ్ సేఫ్టీపై అవగాహన..
News January 10, 2025
కోటగుళ్ళలో ముక్కోటి శోభ
గణపురం మండల కేంద్రంలోని గణపేశ్వరాలయం కోటగుళ్ళలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి నందీశ్వరుని పూజతో మొదలుకొని స్వామివారికి రుద్రాభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
News January 10, 2025
కొడకండ్ల: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం జర్నీ తండా వద్ద గురువారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. డీసీఎం, తుఫాన్ వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. మృతులు సూర్యాపేట జిల్లా ఈటూరు గ్రామానికి చెందిన పేరాల జ్యోతి, పేరాల వెంకన్నగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.