News March 17, 2025
ప్రారంభమైన ఎనుమాముల మార్కెట్.. తగ్గిన పత్తి ధర

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల మార్కెట్ ఈరోజు ప్రారంభం కాగా.. పత్తి బస్తాలను అధిక సంఖ్యలో రైతులు మార్కెట్కు తీసుకువచ్చారు. అయితే తాము ఆశించిన స్థాయిలో ధర రాలేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేడు పత్తి ధర క్వింటాకి రూ.6,825 ధర పలికిందని చెప్పారు. గత వారం పత్తి ధర రూ.6,960 పలకగా ఈరోజు ధరలు భారీగా పడిపోవడంతో పత్తి రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
Similar News
News March 18, 2025
HYD: దుకాణం.. అగ్ని ప్రమాదానికి ఆహ్వానం!

కిరాణా దుకాణాలు ప్రమాదపు బాంబులుగా మారాయి. అగ్ని ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఘట్కేసర్ మండల పరిధిలో షాపుల్లోనే అక్రమంగా పెట్రోల్ అమ్ముతున్నారు. పెట్రోలియం ఆక్ట్, 1934 ప్రకారం ఇది తీవ్ర నేరం. కఠిన శిక్షలు విధించాలి. కానీ, అధికారుల నిద్రమత్తుతో ఈ దందా బహిరంగంగా సాగుతోంది. చిన్న అగ్ని ప్రమాదమే పెను విషాదంగా మారనుంది. ఇప్పటికైనా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
News March 18, 2025
NLG: టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: DEO

మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీవరకు నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు 105 రెగ్యులర్ కేంద్రాలను, 3 ప్రైవేట్ కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం 18,666 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు.
News March 18, 2025
టీడీపీ, జనసేనతో కలిస్తే మాకే నష్టం: బీజేపీ ఎమ్మెల్యే

తెలంగాణలోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేస్తాయని జరుగుతున్న ప్రచారంపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలతో కలిసి పోటీ చేస్తే తమ పార్టీకే నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సొంతంగా ఎదుగుతున్న సమయంలో ఇతర పార్టీలతో పొత్తు సరికాదన్నారు. కొన్ని అంశాలపై ప్రాంతీయ, జాతీయ పార్టీల వైఖరుల మధ్య తేడాలుంటాయని పేర్కొన్నారు.