News March 22, 2025
ప్రారంభమైన కాజీపేట-విజయవాడ (MEMU) ట్రైన్

కాజీపేట నుంచి డోర్నకల్, ఖమ్మం మీదుగా విజయవాడ వరకు వెళ్లే (MEMU) ట్రైన్ నంబర్ 67269) ఈరోజు నుంచి ప్రారంభమైంది. ట్రైన్ ఉ.6:40 ని.లకు బయలుదేరి మధ్యాహ్నం 12: 00 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. మూడో లైన్ పనులు, కారణాల వల్ల కొంతకాలంగా ఈ ట్రైన్ నిలిపివేశారు. పనులు పూర్తి కావడంతో ఈ రైలును మళ్లీ పునరుద్ధరించారు.
Similar News
News November 3, 2025
BHPL: ప్రకృతి జాతరలో ప్రత్యేక ఆకర్షణగా ఏనుగు బండ్లు!

రెండో తిరుపతిగా ప్రసిద్ధి చెందిన BHPL(D) రేగొండ(M) తిరుమలగిరి శివారు బుగులోని వేంకటేశ్వర స్వామి జాతర ప్రకృతి సౌందర్యాన్ని సంతరించుకుంది. కాగా, ఈ జాతరలో భక్తులు వెంకన్న స్వామి వారికి ఏనుగు, మేక బండ్లతో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. టపాసులు పేలుస్తూ.. డప్పు చప్పుళ్లతో ఏనుగు బండ్లను కొండకు తీసుకువచ్చే కార్యక్రమం కనులవిందు చేయనుంది. అంతేకాదు, జాతరకు భక్తులు ఎడ్ల బండ్లపై రావడం విశేషం.
News November 3, 2025
నిజమైన శివపూజ ఇదే!

శివపూజకు అన్నీ ఉండాలనుకోవడం మన అపోహ మాత్రమేనని పండితులు చెబుతున్నారు. శివుడు కోరేది నిర్మలమైన మనసు మాత్రమేనని అంటున్నారు. ఎలాంటి ఆడంబరాలు లేకపోయినా భక్తితో ‘స్వామి! నన్ను రక్షించు’ అని అడిగినా ఆయన ప్రసన్నుడవుతాడని పురాణాల వాక్కు. శివుడి పట్ల మనసు స్థిరంగా ఉంచడమే అసలైన శివభక్తి అని నమ్మకం. ఆయనతో కష్టసుఖాలు చెప్పుకొని, లాలించి, అలిగి, బుజ్జగించే మానసిక అనుబంధాలే అత్యంత ప్రీతిపాత్రమైనవని అంటారు.
News November 3, 2025
మూల మలుపు.. ఓవర్ స్పీడ్ ప్రమాదానికి కారణం?

మీర్జాగూడ ప్రమాదంపై రవాణా శాఖ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటు బస్సు, అటు టిప్పర్ రెండు ఓవర్ స్పీడ్తో వచ్చాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ప్రమాదం జరిగిన ప్రాంతంలో మూల మలుపు కూడా ఉందని, దీంతో రెండు వాహనాలు ఢీ కొట్టగానే కంకర మొత్తం ప్రయాణికుల మీదకు వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. కంకర కూడా ఓవర్ లోడ్ కావడంతో.. బరువు పెరిగి అదుపుతప్పినట్లు అంచనా వేస్తున్నారు.


