News September 20, 2024
ప్రారంభమైన దుర్గ్ – విశాఖ వందే భారత్

నూతనంగా ఇటీవల ప్రారంభించిన విశాఖ – దుర్గ్ వందే భారత్ ట్రైన్ దుర్గ్ నుంచి శుక్రవారం ఉదయం 5.45 నిమిషాలకు బయలుదేరి పార్వతీపురం 11:38 నిమిషాలకు చేరుకుంది. ఈ ట్రైన్ వారంలో గురువారం మినహా మిగిలిన అన్ని రోజులు ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. బొబ్బిలిలో నిలుపుదలకు స్థానిక MLA అడిగినప్పటికీ ఇంకా ఎటువంటి సమాచారం లేదు. ఈ ట్రైన్ తిరిగి విశాఖలో మధ్యాహ్నం 2:50 నిమిషాలకు దుర్గ్ బయలుదేరనుంది.
Similar News
News September 19, 2025
తెర్లాం: తండ్రిని చంపిన కసాయి కొడుకు

క్షణికావేశంలో కన్న తండ్రినే చంపాడు కసాయి కొడుకు. తెర్లాం (M) ఎంఆర్.అగ్రహారానికి చెందిన అప్పలస్వామికి ఇద్దరు కొడుకులు. తన గురించి ఊరంతా చెడుగా చెబుతున్నాడంటూ చిన్న కుమారుడు శంకరరావు తండ్రితో వాగ్వాదానికి దిగాడు. ఈక్రమంలోనే కోపంలో రాయితో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన అప్పలస్వామిని మనవరాలు కల్పన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News September 19, 2025
VZM: రానున్న 20 రోజులు ఎరువుల సరఫరా కీలకం: కలెక్టర్

రానున్న 20 రోజులు ఎరువులు సరఫరా కీలకమని మండల వ్యవసాయాధికారులు, తహశీల్దార్లు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లాలో ఎరువులు లభ్యత, సరఫరాపై మండల వ్యవసాయాధికారులు, తహశీల్దార్లతో కలెక్టర్ గురువారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రైవేట్ ఎరువుల దుకాణాలలో తనిఖీలు నిర్వహించి వారి వద్ద ఉన్న ఎరువుల నిల్వలను తక్షణ అవసరం ఉన్న ప్రాంతాలకు సరఫరా చేయాలన్నారు.
News September 19, 2025
DSP శ్రీనివాసరావుకు బదిలీ

VZM సబ్ డివిజన్ DSP శ్రీనివాసరావును వీఆర్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై పలు అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ విభాగం, పోలీస్ ఉన్నతాధికారులు DSPవ్యవహారాలపై సమగ్రంగా విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఉమెన్ PS DSPగా పనిచేస్తున్న గోవిందరావుకు ఇన్ఛార్జ్ DSPగా బాధ్యతలు అప్పగించారు.