News April 4, 2024
ప్రార్థనా మందిరాల్లో ప్రచారాలు నిషేధం: కలెక్టర్

అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విధిగా పాటిస్తూ.. తమ ప్రచారాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు ప్రార్థనా మందిరాల్లో ప్రచారాలు నిర్వహించకూడదన్నారు. పార్టీ కండువాలతో వెళ్లొద్దని సూచించారు.
Similar News
News January 11, 2026
రేపు తెనాలి ఐటీఐలో అప్రెంటిస్ మేళా..15 కంపెనీల రాక

తెనాలి చినరావురులోని ప్రభుత్వ ఐటీఐ శిక్షణ కేంద్రంలో ఈ నెల 12వ తేదీ సోమవారం నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రావి చిన వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యోగ మేళాలో సుమారు 15 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని ఐటిఐ పాసైన విద్యార్థులందరికీ అప్రెంటిస్ షిప్ అవకాశాలు కల్పిస్తాయని చెప్పారు. అర్హత కలిగిన వారు తమ సర్టిఫికెట్లు, బయోడేటా, ఆధార్ కార్డు నకలుతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని చెప్పారు.
News January 10, 2026
GNT: నటబ్రహ్మ ముక్కామల.. రంగస్థలం నుంచి వెండితెర దాకా

నటుడు, దర్శకుడు ముక్కామల కృష్ణమూర్తి (1920-1987) ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాలలో జన్మించారు. న్యాయవాదిగా ఉంటూనే రంగస్థలంపై ‘బొబ్బిలి యుద్ధం’ నాటకంలో బుస్సీ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మాయా మచ్ఛీంద్ర’ చిత్రంతో సినిమాల్లోకి వచ్చి, మాయాబజార్ (దుర్యోధనుడు), నర్తనశాల, తెనాలి రామకృష్ణ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ‘మరదలు పెళ్లి’, ‘రుష్యశృంగ’ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
News January 10, 2026
నేటి విద్యార్థులే రేపటి భారత నిర్మాతలు: మంత్రి అనిత

నేటి విద్యార్థులే రేపటి భావి భారత నిర్మాతలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వడ్డేశ్వరంలోని KL University ఆవరణలో శనివారం జరిగిన స్టూడెంట్ ఇంటరాక్టివ్ మీట్లో ఆమె పాల్గొని, విద్యార్థులతో నేరుగా మమేకమయ్యారు. ఇంజినీరింగ్ మొదటి విడత ఫలితాలను విడుదల చేశారు. ఫిబ్రవరి 23న జరగనున్న ఇంటర్నేషనల్ ఉమెన్ సమ్మిట్ పోస్టర్తో పాటు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నీ పోస్టర్ను ఆవిష్కరించారు.


